తెరపైకి సతీష్రెడ్డి పేరు | Satish Reddy name came out for AP Legislative Council Dy chairman post | Sakshi
Sakshi News home page

తెరపైకి సతీష్రెడ్డి పేరు

Published Wed, Sep 3 2014 2:31 PM | Last Updated on Sat, Aug 18 2018 9:30 PM

తెరపైకి సతీష్రెడ్డి పేరు - Sakshi

తెరపైకి సతీష్రెడ్డి పేరు

హైదరాబాద్: ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి టీడీపీ ఎమ్మెల్సీ సతీష్రెడ్డి తెరపైకి వచ్చింది. సతీష్రెడ్డిని పోటీకి దింపాలని టీడీపీ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు రేసులో నిలిచిన చైతన్యరాజును పలువురు ఎమ్మెల్సీలు వ్యతిరేకిస్తుండడంతో ఆయన స్థానంలో సతీష్ రెడ్డి పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం.

చైతన్యరాజుకు మద్దతు కూడగట్టేందుకు మంత్రులు చినరాజప్ప, నారాయణ, కామినేని శ్రీనివాస్ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని చెబుతున్నారు. చేసేదిలేక చైతన్యరాజును మార్చాలన్న నిర్ణయానికి అధికార పార్టీ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇంకెన్నీ మలుపులు తిరుగుతుందో చూడాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement