MLC Chaintanya Raju
-
తెరపైకి సతీష్‌రెడ్డి పేరు
హైదరాబాద్: ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి టీడీపీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి తెరపైకి వచ్చింది. సతీష్‌రెడ్డిని పోటీకి దింపాలని టీడీపీ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు రేసులో నిలిచిన చైతన్యరాజును పలువురు ఎమ్మెల్సీలు వ్యతిరేకిస్తుండడంతో ఆయన స్థానంలో సతీష్ రెడ్డి పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. చైతన్యరాజుకు మద్దతు కూడగట్టేందుకు మంత్రులు చినరాజప్ప, నారాయణ, కామినేని శ్రీనివాస్ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని చెబుతున్నారు. చేసేదిలేక చైతన్యరాజును మార్చాలన్న నిర్ణయానికి అధికార పార్టీ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇంకెన్నీ మలుపులు తిరుగుతుందో చూడాలి. -
'చైతన్యరాజు వద్దు.. టీడీపీ ఎమ్మెల్సీని పెట్టండి'
హైదరాబాద్: ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పోటీలో టీడీపీ అభ్యర్థిగా నిలిచిన చైతన్యరాజును పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వ్యతిరేకిస్తున్నారు. చైతన్యరాజుకు మద్దతు ఇవ్వబోమని అంటున్నారు. కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు పేర్కొనడంతో వారిని బుజ్జగించేందుకు మంత్రులు చినరాజప్ప, నారాయణ, కామినేని శ్రీనివాస్ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలను కూడా మంత్రులు సంప్రదించినట్టు తెలుస్తోంది. చైతన్యరాజును కాకుండా టీడీపీ ఎమ్మెల్సీని డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా నిలపాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సూచించినట్టు సమాచారం.