'చైతన్యరాజు వద్దు.. టీడీపీ ఎమ్మెల్సీని పెట్టండి'
హైదరాబాద్: ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పోటీలో టీడీపీ అభ్యర్థిగా నిలిచిన చైతన్యరాజును పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వ్యతిరేకిస్తున్నారు. చైతన్యరాజుకు మద్దతు ఇవ్వబోమని అంటున్నారు. కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు పేర్కొనడంతో వారిని బుజ్జగించేందుకు మంత్రులు చినరాజప్ప, నారాయణ, కామినేని శ్రీనివాస్ రంగంలోకి దిగారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీలను కూడా మంత్రులు సంప్రదించినట్టు తెలుస్తోంది. చైతన్యరాజును కాకుండా టీడీపీ ఎమ్మెల్సీని డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా నిలపాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సూచించినట్టు సమాచారం.