PDF MLCs
-
ఉపాధ్యాయుల అరెస్టుపై భగ్గుమన్న ఎమ్మెల్సీలు
సాక్షి, అమరావతి: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ పోరాటం చేస్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేయడంపై శాసనమండలిలో ఎమ్మెల్సీలు భగ్గుమన్నారు. ఉపాధ్యాయుల అరెస్టులు ఆపేవరకు సభను జరగనివ్వమంటూ మండలిలో నినాదాలు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నిరసనతో మండలిలో గురువారం గందరగోళం నెలకొంది. సీపీఎస్ వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం తీరు, ఉపాధ్యాయుల అరెస్టు తదితర అంశాలపై నిరసన వ్యక్తం చేస్తూ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మండలి హాల్లో బైఠాయించారు. రాత్రి నుంచి ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారని, నిరసన తెలిపితే అరెస్టు చేస్తారా? అని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోలీసులను వెనక్కి తీసుకోవాలని, అరెస్టులను ఆపాలంటూ మండలి చైర్మన్‌తో ఎమ్మెల్సీలు వాగ్వాదానికి దిగారు. సీపీఎస్ విషయంలో తమ సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆందోళన కొనసాగిస్తామని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. దీంతో కల్పించుకున్న మండలి డిప్యూటీ చైర్మన్.. సీపీఎస్ అంశంపై చర్చకు శుక్రవారం అనుమతి ఇస్తామని పీడీఎఫ్ ఎమ్మెల్సీలకు హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆందోళన విరమించారు. -
సీపీఎస్ రద్దు చేయాలంటూ శాసన మండలిలో ఆందోళన
-
ఏపీ శాసన మండలిలో ఆందోళన
సాక్షి, అమరావతి : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఇంచార్జి చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యంకు వాయిదా తీర్మానం ఇచ్చారు. సీపీఎస్‌పైన చర్చించాలంటూ వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు. సమస్యలపై చర్చించకపోతే సభకెందుకు రావాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. టీ బ్రేక్ సమయంలో ఈ విషయంపై చర్చిద్దామని, తన చాంబర్‌కు రావాల్సిందిగా ఇంచార్జి చైర్మన్ చెప్పగా.. మండలిలో చర్చ జరగాల్సిందేనని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. సీపీఎస్‌ను రద్దుపై ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటే ఉద్యోగులంతా కలిసి సార్వత్రిక సమ్మెలకు వెళ్తారని హెచ్చరించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న టీచర్లపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. (సీపీఎస్ రద్దు కోరుతూ... కదం తొక్కిన ఉద్యోగులు) -
ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్) రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ మంగళవారం ప్యాప్టో ఆధ్వర్యంలో చేపట్టిన చలోఅసెంబ్లీ రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారితీసింది. వివిధ జిల్లాల నుంచి అసెంబ్లీ ముట్టడికి తరలివస్తున్న ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రకాశం బ్యారేజీ నుంచి వెలగపూడి వరకు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు.. స్కూల్ బస్సులు, ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుల్ని కూడా తనిఖీలు చేస్తున్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా విజయవాడ లెనిన్ సెంటర్‌కు భారీగా ఉద్యోగులు చేరుకున్నారు. పలుచోట్ల ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ఈడ్చుకుంటూ వెళ్లారు. మహిళల ఉద్యోగులను సైతం పోలీసులు ఈడ్చుకెళ్లారు. ఉద్యోగులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. చాలా చోట్ల ఉద్యోగులపై దారుణంగా ప్రవర్తించారు. ఉద్యోగుల అక్రమ అరెస్టులపై పీడీఎఫ్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎస్‌పై వైఎస్ జగన్ ఇప్పటికే తన వైఖరి ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయంలో టీడీపీ తన వైఖరి వెల్లడించడానికి ఇబ్బందేంటని ప్రశ్నించారు. ఎన్నడు లేని విధంగా ఉపాధ్యాయులను అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. సీపీఎస్ రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్‌పై చర్చిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని తెలిపారు. ఏపీలో వేలాది మంది ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారని.. ప్రభుత్వం వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఉపాధ్యాయుల అక్రమ అరెస్ట్‌లపై శాసనమండలిలో పీడీఎఫ్ సభ్యులు వాయిదా తీర్మానం ఇవ్వగా.. మండలి చైర్మన్ దానిని తిరస్కరించారు. దీంతో సీపీఎస్ రద్దుతో పాటు ఉపాధ్యాయుల అక్రమ అరెస్ట్‌పై మండలిలో చర్చ చేపట్టాలని పీడీఎఫ్ సభ్యులు చైర్మన్ పోడియం ముందు నిరసనకు దిగారు. సీపీఎస్ రద్దు చేయమంటే అక్రమ అరెస్టుల చేస్తారా అని మండిపడ్డారు. ఉపాధ్యాయులు అనుకుంటున్నారా.. ఉగ్రవాదులు అనుకుంటున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్కూళ్లలోకి వెళ్లి ఉపాధ్యాయులను అరెస్ట్ చేయాల్సిన అవసరమేముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దుపై మండలిలో వెంటనే చర్చ జరపాలని.. దీనిపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని పీడీఎఫ్ సభ్యులు పట్టుబట్టారు. సీపీఎస్ రద్దుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా పీడీఎఫ్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. -
కడప ఉక్కు రాయలసీమ హక్కు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా కడపలో ఉక్కు కర్మాగారం కోసం 5 నెలలగా ప్రజలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, వై.శ్రీనివాసులరెడ్డి, రాము సూర్యారావు, బొడ్డు నాగేశ్వరరావు సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కడప ఉక్కు రాయలసీమ హక్కు అని దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కత్తి నరసింహారెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర విభజనకు ముందు ఖాళీగా ఉన్న 1.86 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే శాసనసభ, శాసన మండలి సమావేశాలు ముగిసేలోగా రాష్ట్రంలో తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ ఆర్డినెన్స్ చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ విడుదల చేసిన జీవో నంబర్ 14ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కర్నాటక, తమిళనాడులో ప్రాంతీయ భాషను తప్పనిసరి చేశారన్నారు. -
'చైతన్యరాజు వద్దు.. టీడీపీ ఎమ్మెల్సీని పెట్టండి'
హైదరాబాద్: ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పోటీలో టీడీపీ అభ్యర్థిగా నిలిచిన చైతన్యరాజును పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వ్యతిరేకిస్తున్నారు. చైతన్యరాజుకు మద్దతు ఇవ్వబోమని అంటున్నారు. కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు పేర్కొనడంతో వారిని బుజ్జగించేందుకు మంత్రులు చినరాజప్ప, నారాయణ, కామినేని శ్రీనివాస్ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలను కూడా మంత్రులు సంప్రదించినట్టు తెలుస్తోంది. చైతన్యరాజును కాకుండా టీడీపీ ఎమ్మెల్సీని డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా నిలపాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సూచించినట్టు సమాచారం.