కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఇంచార్జి చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యంకు వాయిదా తీర్మానం ఇచ్చారు. సీపీఎస్‌పైన చర్చించాలంటూ వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు. సమస్యలపై చర్చించకపోతే సభకెందుకు రావాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.