ఆక్సీజన్‌ ప్లాంట్‌లో రీఫిల్లింగ్‌ చేస్తుండగా ప్రమాదం, ఒకరు మృతి | Uttar Pradesh: One killed Two Injured In Blast Oxygen Plant Kanpur | Sakshi
Sakshi News home page

ఆక్సీజన్‌ ప్లాంట్‌లో రీఫిల్లింగ్‌ చేస్తుండగా ప్రమాదం, ఒకరు మృతి

Published Fri, Apr 30 2021 11:59 AM | Last Updated on Fri, Apr 30 2021 1:35 PM

 Uttar Pradesh: One killed Two Injured In Blast Oxygen Plant Kanpur- sakshi - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఓ పారిశ్రామిక ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. ఆక్సిజన్ ప్లాంట్‌లో ప్రమాదం జరడంతో.. ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఆక్సీజన్‌ సిలిండర్లలో రీఫిల్లింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు తెలిసింది. కాన్పూర్‌లోని దాదా నగర్ పారిశ్రామిక ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు వివరాలు ప్రకారం.. దాదా నగర్ పారిశ్రామిక ప్రాంతంలోని పంకి ఆక్సిజన్‌ ప్లాంట్‌లో శుక్రవారం ఉదయం ఎప్పటిలానే ఆక్సిజన్‌ సిలిండర్లను రీఫిల్లింగ్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో ప్లాంట్‌లో కార్మికుడిగా పనిచేస్తున్న ఇమ్రాద్ అలీ మరణించగా, మరో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులు లాలా లాజ్‌పత్ రాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

( చదవండి: ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement