తిరుపతి రుయా ఆస్పత్రిలో అదనపు ఆక్సిజన్‌ ప్లాంట్‌ | Actions To Set Up Additional Oxygen Plant At Tirupati Ruia Hospital | Sakshi
Sakshi News home page

తిరుపతి రుయా ఆస్పత్రిలో అదనపు ఆక్సిజన్‌ ప్లాంట్‌

Published Tue, May 11 2021 1:09 PM | Last Updated on Tue, May 11 2021 1:14 PM

Actions To Set Up Additional Oxygen Plant At Tirupati Ruia Hospital - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో అదనపు ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసే ప్రదేశాన్ని నేవీ అధికారులు పరిశీలించారు. ఆస్పత్రిలో సోమవారం రాత్రి ఆక్సిజన్‌ సరఫరాలో ప్రెజర్‌ తగ్గి 5 నిమిషాల పాటు అంతరాయం ఏర్పడటంతో 11 మంది కరోనా బాధితులు ఊపిరాడక మృతి చెందిన నేపథ్యంలో మరో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ ఘటనపై వెంటనే పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కలెక్టర్‌ హరినారాయణన్‌ విచారణ చేపట్టారు. చెన్నై నుంచి ఆక్సిజన్ ట్యాంకర్‌ ఆలస్యంతో ఇబ్బంది తలెత్తిందని కలెక్టర్‌ వెల్లడించారు. వెంటనే ఆక్సిజన్ పునరుద్ధరించడం వల్ల చాలా మందిని రక్షించామని తెలిపారు.

చదవండి: ‘రుయా’లో విషాదం.. సీఎం జగన్‌ దిగ్భ్రాంతి
YS Jagan: ప్రజలకు వాస్తవాలు వివరిద్దాం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement