సాక్షి, తిరుపతి: తిరుపతి రుయా ఘటనపై కలెక్టర్ హరినారాయణన్ విచారణ చేపట్టారు. ఆక్సిజన్ ప్రెజర్ తగ్గడం వల్ల 11 మంది చనిపోయారని కలెక్టర్ తెలిపారు. చెన్నై నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంతో ఇబ్బంది తలెత్తిందని వెల్లడించారు. వెంటనే ఆక్సిజన్ పునరుద్ధరించడం వల్ల చాలా మందిని రక్షించామని తెలిపారు. సకాలంలో ఆక్సిజన్ అందించడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. రుయాలో వెయ్యి మందికి చికిత్స జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.
తిరుపతి రుయా ఘటనపై మంత్రి గౌతమ్‌రెడ్డి దిగ్భ్రాంతి
తిరుపతి రుయా ఘటనపై మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆక్సిజన్ ప్రెజర్ తగ్గి 11 మంది చనిపోవడం కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి తెలిపారు. ఆక్సిజన్ ను వెంటనే పునరుద్ధరించి వందల మంది ప్రాణాలు కాపాడిన వైద్యులకు, సిబ్బందికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఘటనపై సూపరింటెండెంట్ డాక్టర్ భారతి దిగ్భ్రాంతి
తిరుపతి రుయా ఘటనపై సూపరింటెండెంట్ డాక్టర్ భారతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెరంబదూర్ నుంచి రావాల్సిన ఆక్సిజన్ సమయానికి రాలేదని.. ఆక్సిజన్ ప్రెజర్ తగ్గి, అందరికి అవసరమైన ఆక్సిజన్ అందలేదని ఆమె వివరించారు. ప్రత్యామ్నాయంగా బల్క్ సిలిండర్లు ఏర్పాటు చేశామని డాక్టర్ భారతి తెలిపారు.
చదవండి: ‘రుయా’లో విషాదం.. సీఎం జగన్ దిగ్భ్రాంతి
ఏపీ: కర్ఫ్యూ సమయంలో ఈ పాస్ తప్పనిసరి
Comments
Please login to add a commentAdd a comment