
మహబూబాబాద్: ‘హలో.. శంకర్ ఎలా ఉన్నారు, కుటుంబసభ్యులు బాగున్నా రా.. ప్రజల్లో బాగా తిరుగుతారు. పరిస్థితులు బాగాలేవు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి’’ అని మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ‘మానుకోట నా అభిమాన కోట శంకర్, మీ మాట కోసం జిల్లాకు ఆక్సిజన్ బ్యాంక్ ఇచ్చాను’ అని చెప్పినట్లు శంకర్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఆక్సిజన్ బ్యాంకు మంజూరు చేయడంపై ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి:
సీఎం సహాయనిధికి హాస్యనటుడు సూరి విరాళం
‘లూసిఫర్’ రీమేక్‌లో కీలక పాత్రలో వరుణ్ తేజ్!?
Comments
Please login to add a commentAdd a comment