‘సువర్ణ యుగం’ జగన్‌తోనే సాధ్యం | suvarnayugam possible with jagan | Sakshi

‘సువర్ణ యుగం’ జగన్‌తోనే సాధ్యం

Dec 31 2013 3:58 AM | Updated on Apr 4 2018 9:31 PM

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డితోనే సువర్ణయుగం సాధ్యమని పార్టీ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

 పామిడి,న్యూస్‌లైన్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డితోనే సువర్ణయుగం సాధ్యమని పార్టీ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక వీరా ఫంక్షన్‌హాలులో పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ అధ్యక్షతన గుంతకల్ నియోజకవర్గ విస్త్రృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్ హయాంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందారన్నారు.

ఆయన మరణానంతరం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచిందన్నారు.  రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో 50 ఏళ్లు వెనక్కు వెళ్లిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీకి వంతపాడడం ఆయన చేతకాని తనానికి నిదర్శనమన్నారు. సమైక్యాంధ్ర ముసుగులో ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతతో పాటు అశోక్‌బాబు ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. రాహుల్‌ను ప్రధానిని చేయడంలో భాగంగా  వారు రాష్ట్ర విభజనకు పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. జననేత జగన్ మాత్రమే సమైక్యాంధ్రకోసం పోరాడుతున్నారన్నారు. ఆయనను సీఎం చేయాలన్నది జనం అభిమతమన్నారు.

అధిష్టానికి తల్గొగి ప్రజావ్యతిరేకతను కూడగట్టుకున్న కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, మంత్రులతోపాటు, వారికి వంతపాడుతున్న  చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. వైఎస్ పాలన మళ్లీ చూడాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలని, వైఎస్సార్ సీపీ అభ్యర్థులనందరినీ ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని వైఎస్సార్‌సీపీ గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి, జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎం.వీరాంజనేయులు, బోయ తిప్పేస్వామి, లింగాల రమేష్ తదితరులు కోరారు.జగన్ సీఎం అయ్యాకేసమస్యలన్నీ పరిష్కారమవుతాయని తెలిపారు.

 సమావేశంలో అనంత, కడప జిల్లాల సభ్యత్వ నమోదు సమన్వయకర్త చుక్కలూరు దిలీప్ రెడ్డి, పట్టణ, రూరల్ కన్వీనర్లు బొల్లు వెంకట్రామిరెడ్డి, చుక్కలూరు రామచంద్రారెడ్డి, సింగిల్ విండో ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement