
సాక్షి, అనంతపురం: ఆంధ్రజ్యోతి, చంద్రబాబు కుమ్మక్కై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర్ నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక సచివాలయం ఉద్యోగ పరీక్షల్లో అవినీతి జరిగిందని కట్టుకథలు అల్లారని ఎల్లోమీడియాపై మండిపడ్డారు. అవాస్తమని తేలడంతో గప్‌చిప్ అయ్యారన్నారు. ఇకనైనా వాస్తవాలు ప్రచురించాలని.. లేకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.