
సాక్షి, శ్రీకాకుళం: గతంలో టీడీపీ నిర్వాకం వల్లే రోడ్లన్నీ గుంతలతో ఉన్నాయని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు బిల్లులను పెండింగ్‌లో పెట్టడం వల్లే ఇప్పుడు అవస్థలు పడుతున్నామని తెలిపారు. భవిష్యత్ ప్రణాళిక కోసమే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నామని పేర్కొన్నారు. (చదవండి: ‘జూమ్‌లో చంద్రబాబు.. ట్విట్టర్‌లో లోకేష్’)
విద్యుత్ వినియోగానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా రైతుల నుండి వసూలు చేయం అని మంత్రి స్పష్టం చేశారు. అచ్చెన్నాయుడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకు తెలియడం లేదని ధ్వజమెత్తారు. తమకు ప్రజలు ఐదేళ్లు అవకాశం ఇచ్చారని, ఐదేళ్లు పాలన చేసిన తర్వాత అప్పుడు విమర్శలు చేయాలన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్లో ఒక్కటైనా గతంలో మీరు ఆలోచన చేశారా అని మంత్రి కృష్ణదాస్ ప్రశ్నించారు.(చదవండి: ‘పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు’)
Comments
Please login to add a commentAdd a comment