
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ నేత లోకేష్‌పై మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ తిన్న అవినీతి సొమ్మును వడ్డీతో సహా రాబడతామని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫైబర్ గ్రిడ్ స్కాంలో దోషులు బయటకు వస్తారని పేర్కొన్నారు. అవినీతిపై విచారణ చేస్తుంటే లోకేష్ ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు పాత్ర కీలకమైనదన్నారు. అవినీతికి పాల్పడ్డ ఎవ్వరినీ వదిలిపెట్టమని మంత్రి స్పష్టం చేశారు. (ఆయనకు చదువు అబ్బక ఇక్కడే ఉండిపోయారు : కొడాలి నాని)
చదవండి: ధనికులకు బాబు.. పేదలకు జగన్