త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయిం చుకున్నారని, ఆయన చేరికకు పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సూ త్రప్రాయంగా అంగీకరించారని ఆ పార్టీ శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధర్మాన ప్రసాదరావుతో పాటు కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ఓ భారీ బహిరంగ సభ ద్వారా త్వరలో వైఎస్సార్ సీపీలో చేరనున్నట్టు చెప్పారు. పార్టీ అధ్యక్షుడు జగన్ అనుమతితో బహిరంగ సభ తేదీని ఖరారు చేస్తామన్నారు.
జిల్లాలో ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ బలంగా ఉందని, ధర్మాన చేరి కతో మరింత బలం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు ధర్మాన పద్మప్రియ మాట్లాడుతూ.. వైఎస్సార్ హయాంలో సాధించినట్లుగా జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్ సీపీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త వై.వి.సూర్యనారాయణ పాల్గొన్నారు.