'త్వరలో వైఎస్సార్ సీపీలోకి ధర్మాన ప్రసాదరావు'
శ్రీకాకుళం: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు త్వరలో వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. డిసెంబర్ రెండో వారంలో వైఎస్సార్ సీపీ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్ సీపీలో చేరతారని తెలిపారు. ప్రసాదరావు వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు ప్రకటించపట్ల కృష్ణదాస్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెడితే తాను కాంగ్రెస్ పార్టీని వీడతానని మాజీమం త్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు గతంలోనే చెప్పారు.
తెలంగాణ డిమాండ్ ఏనాటి నుంచో ఉందని దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదనిపించినా ఏకపక్షంగా వారికే లబ్దిచేకూర్చేలా నిర్ణయం తీసుకోవడం, సీమాంధ్ర సమస్యలను, ఇక్కడి ప్రజల మనోగతాన్ని పట్టించుకోకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.