సాక్షి, అమరావతి : భూముల రీ సర్వే నిర్ణయం చారిత్రాత్మకమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జగ్గయ్యపేట మండలం తక్కెళ్ళపాడులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. 2023 జూలై నాటికి ఈ సర్వే పూర్తి చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భూమి అంశంలో ఏ చిన్న సమస్య ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వైఎస్ జగన్ పాదయాత్రలో భూ వివాదాలపై అనేక ఫిర్యాదులు అందాయని ప్రస్తావించారు. భూ సర్వే ప్రజలందరికీ మేలు చేసే కార్యక్రమమని.. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయత్నించినా ప్రైవేట్ సంస్థల వలన అది పూర్తి కాలేదని గుర్తు చేశారు. చదవండి: ‘సవరించిన అంచనాలను ఆమోదించండి’
ఈసారి మేము సర్వే ఆఫ్ ఇండియా తో కలిసి పని చేస్తున్నాం .స్థిరాస్తులు అన్ని సర్వే చేస్తాం. గ్రామ సచివాలయాల్లో ఈ భూ రికార్డులు అందుబాటులో ఉంటాయి. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి రైతులకు అండగా నిలుస్తాం. చట్టబద్ధమైన, న్యాయమైన హక్కులు చేకూరుతాయి అని భావిస్తున్నాం. ఇప్పటికే ఈ అంశం పై ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మొదలయ్యాయి. అత్యాధునిక సాంకేతికతతో సర్వే నిర్వహిస్తాం. ప్రజలతో పాటు, ప్రతిపక్షాలు కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరుతున్నాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment