
రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి
రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు వైఎస్ జగన్ పరిష్కారం చూపుతారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు.
హైదరాబాద్ : రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు వైఎస్ జగన్ పరిష్కారం చూపుతారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జగన్‌తో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వైఎస్‌ఆర్సీపీ ఎమ్మెల్యేలతో జగన్ ఈరోజు భేటీ అయ్యారు. ఈ క్రమంలో జగన్‌ను ఆయన నివాసంలో శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట ఎమ్మెల్యే కృష్ణ దాస్ కలిశారు. బెయిల్‌పై జగన్ బయటకురావడంతో ఇకపై పార్టీ బలోపేతానికి అవసరమైన సూచనలు సలహాలు జగన్ ద్వారా తమకు అందుతాయని అన్నారు. జగన్ రాకతో రాష్ట్రానికి మంచిరోజులు వచ్చాయని కృష్ణదాస్ అన్నారు.