సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాలకు విశాఖపట్నం నుంచి బదిలీపై వచ్చి తిరిగి డిప్యుటేషన్‌పై విశాఖపట్నం కేజీహెచ్‌కు వెళ్లిన స్టాఫ్ నర్సుల వ్యవహారంపై రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెల్సుకున్న ఆయన వైద్యశాఖ మంత్రి ఆళ్లనానితో మాట్లాడిన అనంతరం జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌వో, డీటీహెచ్‌ఎస్, రిమ్స్ అధికారులతో సోమవారం ఈ అంశపై చర్చించారు. తక్షణం డిప్యుటేషన్లు రద్దుచేయాలని ఆదేశించారు. 250 మందికిపైగా స్టాఫ్ నర్సులు ఉండగా, 88 మందికి డిప్యుటేషన్ల అమలుపై అధికారులను ప్రశ్నించారు. అవసరమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడనున్నట్లు చెప్పారు. టీచింగ్, రిఫరల్ వైద్యశాల కావడంతో కేజీహెచ్‌కు అదనపు స్టాఫ్ నర్సులు అవసరంగా స్టాఫ్‌నర్సుల డిప్యుటేషన్లు రద్దు చేయండి. కొందరు అధికారులు చెప్పుకొచ్చారు. ఈ వాదన పట్ల మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. రిమ్స్ టీచింగ్ ఆస్పత్రి కాదా అంటూ ప్రశ్నించారు. మెరుగైన వైద్య సేవలు ఇక్కడ అందితే కేజీహెచ్‌కు రోగులను రిఫర్ చేయవల్సిన అవసరం ఏముందన్నారు. నర్సుల డిప్యుటేషన్లను రద్దు చేయాలని మంత్రి కృష్ణదాసు నుంచి ఆదేశాలు అందడం నిజమేనని రిమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కృష్ణవేణి తెలిపారు. ఆదేశాల కాపీని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణమూర్తికి పంపించామన్నారు.
ఎవరెక్కడ పనిచేస్తున్నారు?
అన్ని శాఖలకు కలెక్టర్ లేఖజిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ ఎవరైనా డిప్యుటేషన్‌లపై ఉన్నా, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నా వెంటనే తెలియజేయాలని కలెక్టర్ అన్ని శాఖలకు లేఖ రాశారు. ఇటీవల రిమ్స్ స్టాఫ్ నర్సుల వ్యవహారం వివాదాస్పదమైన నేపథ్యంలో కొన్ని శాఖల్లో నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్‌లపై వెళ్లడం కలెక్టర్ దృష్టికి రావడంతో ఆయన ఉద్యోగుల వివరాలను వారం రోజుల్లోగా తెలియజేయాలని ఆదేశించారు. శాంక్షన్ పోస్టులలో పనిచేస్తున్నవారు, ఖాళీగా ఉన్న పోస్టులు, డిప్యుటేషన్‌పై ఉన్నవారు, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నవారి వివరాలను తెలియజేయాలని కోరారు. కలెక్టర్ నుంచి ఈ ఆదేశాలు రావడంతో వీటిని సిద్ధం చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment