rims medical college
-
రిమ్స్‌లో ర్యాగింగ్‌పై సదస్సు
సాక్షి, వైఎస్సార్ జిల్లా : పోలీసు శాఖ ఆధ్వర్యంలో రిమ్స్ మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాలు అరికట్టే విధంగా డేగ కళజాత బృందం ఆధ్వర్యంలో నాటకాన్ని ప్రదర్శించారు. జిల్లా ఎస్పీ అభిషేక్ మొహంతి, కడప డీఎస్పీ సూర్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ సదస్సులో రిమ్స్ మెడికల్ విద్యార్థులు భారీగా హాజరయ్యారు. -
స్టాఫ్‌నర్సుల డిప్యుటేషన్లు రద్దు చేయండి
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాలకు విశాఖపట్నం నుంచి బదిలీపై వచ్చి తిరిగి డిప్యుటేషన్‌పై విశాఖపట్నం కేజీహెచ్‌కు వెళ్లిన స్టాఫ్ నర్సుల వ్యవహారంపై రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెల్సుకున్న ఆయన వైద్యశాఖ మంత్రి ఆళ్లనానితో మాట్లాడిన అనంతరం జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌వో, డీటీహెచ్ఎస్, రిమ్స్ అధికారులతో సోమవారం ఈ అంశపై చర్చించారు. తక్షణం డిప్యుటేషన్లు రద్దుచేయాలని ఆదేశించారు. 250 మందికిపైగా స్టాఫ్ నర్సులు ఉండగా, 88 మందికి డిప్యుటేషన్ల అమలుపై అధికారులను ప్రశ్నించారు. అవసరమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడనున్నట్లు చెప్పారు. టీచింగ్, రిఫరల్ వైద్యశాల కావడంతో కేజీహెచ్‌కు అదనపు స్టాఫ్ నర్సులు అవసరంగా స్టాఫ్‌నర్సుల డిప్యుటేషన్లు రద్దు చేయండి. కొందరు అధికారులు చెప్పుకొచ్చారు. ఈ వాదన పట్ల మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. రిమ్స్ టీచింగ్ ఆస్పత్రి కాదా అంటూ ప్రశ్నించారు. మెరుగైన వైద్య సేవలు ఇక్కడ అందితే కేజీహెచ్‌కు రోగులను రిఫర్ చేయవల్సిన అవసరం ఏముందన్నారు. నర్సుల డిప్యుటేషన్లను రద్దు చేయాలని మంత్రి కృష్ణదాసు నుంచి ఆదేశాలు అందడం నిజమేనని రిమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కృష్ణవేణి తెలిపారు. ఆదేశాల కాపీని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణమూర్తికి పంపించామన్నారు. ఎవరెక్కడ పనిచేస్తున్నారు? అన్ని శాఖలకు కలెక్టర్ లేఖజిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ ఎవరైనా డిప్యుటేషన్లపై ఉన్నా, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నా వెంటనే తెలియజేయాలని కలెక్టర్ అన్ని శాఖలకు లేఖ రాశారు. ఇటీవల రిమ్స్ స్టాఫ్ నర్సుల వ్యవహారం వివాదాస్పదమైన నేపథ్యంలో కొన్ని శాఖల్లో నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్లపై వెళ్లడం కలెక్టర్ దృష్టికి రావడంతో ఆయన ఉద్యోగుల వివరాలను వారం రోజుల్లోగా తెలియజేయాలని ఆదేశించారు. శాంక్షన్ పోస్టులలో పనిచేస్తున్నవారు, ఖాళీగా ఉన్న పోస్టులు, డిప్యుటేషన్‌పై ఉన్నవారు, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నవారి వివరాలను తెలియజేయాలని కోరారు. కలెక్టర్ నుంచి ఈ ఆదేశాలు రావడంతో వీటిని సిద్ధం చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. -
‘రిమ్స్’ అప్రతిష్టపాలు
సాక్షి, ఆదిలాబాద్: వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులకు వైద్య సదుపాయం కల్పించాలనే సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఆదిలాబాద్‌లో రిమ్స్ వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు. 2008లో ఈ వైద్య కళాశాల ప్రా రంభమైంది. అప్పట్లో మొదటి బ్యాచ్ పూర్తయ్యే వరకు ఎంసీఐ ప్రతి సంవత్సరం అనుమతులు ఇచ్చేందుకు రిమ్స్‌లో తనిఖీలు నిర్వహించింది. 2008 నుంచి 2013 మధ్యలో ప్రతి సంవత్సరం జరిగిన తనిఖీల్లో పలు ఏడాదిల్లో ఎంసీఐ అనుమతి నిరాకరించడం, దానికి సంబంధించి లోపాలను తెలియజేస్తూ వాటిని సరిదిద్దుకుంటే మళ్లీ అనుమతినివ్వడం జరుగుతూ వచ్చాయి. ఇలా అనేక ఒడిదుడుకులను దాటుతూ మొదటి బ్యాచ్ బయటకు వచ్చిన తర్వాత దీనికి పూర్తిస్థాయి గుర్తింపు లభించింది. ప్రతీ ఐదేళ్లకోసారి ఎంసీఐ బృందం వైద్య కళాశాలలో ఆయా ప్రమాణాలను కొనసాగిస్తున్నారా లేదా అనే పరిశీలన జరిపి మళ్లీ గుర్తింపునిస్తుంది. ఇప్పటికే రిమ్స్ నుంచి ఐదు ఎంబీబీఎస్ బ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. కాగా 2018 జూన్ 5న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బృందం మరోసారి రిమ్స్‌లో ప్రమాణాలను పరిశీలించేందుకు వచ్చింది. దీంట్లో 22 లోపాలను గుర్తించి మరోసారి రిమ్స్‌కు అనుమతి నిరాకరించడంతో వైద్య కళాశాలలో విద్యార్థులు తమ భవితవ్యంపై ఆందోళనలో పడ్డారు. ప్రధానంగా ప్రస్తుతం హౌజ్‌సర్జన్ పూర్తిచేసిన వారు త్వరలో జరిగే పీజీ పరీక్షలు రాయాలంటే రిమ్స్‌కు ఎంసీఐ అనుమతినిస్తేనే సాధ్యమయ్యే పరిస్థితి. 2019లో రిమ్స్‌లో కొత్తగా ప్రవేశాలకు ఈ అనుమతితోనే ముడిపడి ఉంది. ఈ దృష్ట్యా విద్యార్థుల్లో డోలయామానం నెలకొంది. అనుమతి నిరాకరణ తర్వాత పలువురు హౌజ్సర్జన్లు రిమ్స్ డైరెక్టర్ అశోక్‌ను కలిసి ఈ విషయంలో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతర్గత లోపాలు బహిర్గతం.. రిమ్స్‌లో అంతర్గత లోపాలు మరోసారి బహిర్గ తం అయ్యాయి. ప్రధానంగా ఎంసీఐ ఎత్తిచూపిన 22 అంశాల్లో కీలక పదవుల్లో ఉన్న లోపాలు, దాం తోపాటు ప్రొఫెసర్లు, ట్యూటర్ల పోస్టుల ఖాళీలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్ అశోక్ ఆస్పత్రికి సంబంధించి కీలకమైన మెడికల్ సూపరింటెండెంట్ పోస్టు, వై ద్య కళాశాలకు సంబంధించి డైరెక్టర్ పోస్టును తన ఆదీనంలో ఉంచుకున్నారని నివేదికలు స్పష్టం చేయడం రిమ్స్‌లో ప్రధానంగా ఉన్నటువంటి లోపాన్ని ఎత్తిచూపింది. అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఆయన తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్లు లేదని స్పష్టం చేయడం గమనార్హం. డాక్టర్ అశోక్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన ఈ పదవికి అర్హులు కాదని పలువురు ఈ విషయంలో ఆరోపణలు చేస్తూ వచ్చారు. అయినా ఇటు అధికార యంత్రాంగం కాని, అటు పాలకులు కానీ పట్టించుకున్న పాపాన పోకపోవడంతో ఈ వ్యవహారం అలాగే కొనసాగుతూ వస్తోంది. కీలకమైన మెడికల్ సూపరింటెండెంట్ బాధ్యతలు నిర్వర్తిస్తూ అటు డైరెక్టర్‌గా కొనసాగుతూ ఇటు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు న్యాయం చేయడం లేదన్న అపవాదును ఆయన మూటగట్టుకున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా ఉలుకూపలుకు లేకపోవడం చోద్యమే. డీన్ పోస్టులో ఒకరున్నారని.. రిమ్స్ వైద్య కళాశాలలో డీన్ పోస్టు ప్రిన్సిపాల్ పోస్టువంటిది.. అలాంటి పోస్టులో ఓ మహిళా ప్రొఫెసర్ కొనసాగుతున్నారన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఎంసీఐ నివేదికలో ఈ రహస్యాన్ని బట్టబయలు చేసింది. తమ తనిఖీలో డీన్ రెగ్యులర్‌గా డ్యూటీలకు అటెండ్ కావడం లేదని వారు పేర్కొన్నారు. అదే సమయంలో జూన్ 5న తాము తనిఖీకి వచ్చినప్పుడు మధ్యాహ్నం 3గంటల వరకు ఆమె అందుబాటులో లేరని తెలిపారు. డీన్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నిస్తే హైదరాబాద్ డీఎంఈఆర్ ఆఫీసులో మీటింగ్‌కు వెళ్లారని చెప్పారని, ఆ సమయంలో డీఎంఈఆర్ రిమ్స్‌లో 12గంటలకు తమతో ఉన్నారని ఎంసీఐ సభ్యులు తెలపడం రిమ్స్‌లో రహస్యంగా జరుగుతున్న అనేక వ్యవహారాలను తేటతెల్లం చేస్తోంది. అనేక డిక్లరేషన్ ఫారాలపై డీన్ సంతకం చేయాల్సి ఉండగా, వాటిపై సంతకాలు లేవని పేర్కొన్నారు. బయోకెమిస్ట్రి విభాగంలో ఆమె ప్రొఫెసర్‌గా కొనసాగుతున్న విషయం పలువురికి తెలియదని తెలుస్తోంది. గత కొంత కాలంగా ఆదిలాబాద్ రిమ్స్‌లో మెడికల్ సూపరింటెండెంట్‌గా, డైరెక్టర్‌గా, డీన్‌గా ఒక్కరే ఉన్నారనే ప్రచారం ఉంది. దీంతో ఈ పోస్టులో మరొకరు ఉన్నారనే విషయం ఎంసీఐ నివేదికతోనే తేటతెల్లమైంది. ఓ ప్రొఫెసర్ పోస్టులో ఇంతటి రహస్యాలు దాచిపెట్టడం వెనుక ఆంతర్యమేమిటో వారికే తెలియాలి. ఫ్యాకల్టీలో ఖాళీలు.. రిమ్స్‌లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి 35.84 శాతం ఖాళీలు ఉన్నట్లు ఎంసీఐ తన నివేదికలో పేర్కొంది. ప్రధానంగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం వెనుక కొందరి ప్రయోజనం దాగివుందన్న విమర్శలు లేకపోలేదు. ప్రధానంగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల్లో సీనియర్ వ్యక్తులు వచ్చిన పక్షంలో డైరెక్టర్‌గా వారికి అవకాశం దక్కే పరిస్థితి ఉంటుంది. దీంతోనే ఆ పోస్టుల భర్తీలో ఏదో కోణం దాగివుందన్న ఆరోపణలు ఉన్నాయి. ట్యూటర్ పోస్టులు 80.64 శాతం ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఎంసీఐ తనిఖీకి వచ్చిన రోజు ఆస్పత్రిలో పనిచేసే 14 మంది రెగ్యులర్ వైద్యులు హాజరుకాకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో రెసిడెంట్ డాక్టర్ల విషయంలో పోస్టుల ఖాళీలు అధికంగా ఉన్నట్లు ఎంసీఐ నివేదిక చూపిస్తోంది. కీలక బాధ్యతలో ఉన్న వ్యక్తితో ఈ రెగ్యులర్ డాక్టర్లకు కొంతమందికి పొసగకపోవడంతోనే వారు ఆరోజు హాజరుకాలేదనే ప్రచారం లేకపోలేదు. వీటితోపాటు అనేక లోపాలు.. రిమ్స్‌లో కీలక బాధ్యతల్లో ఉన్న వ్యక్తుల లోపాలు, ఫ్యాకల్టీ ఖాళీలతోపాటు ఇతర లోపాలను కూడా ఎంసీఐ ఎత్తిచూపింది. ప్రధానంగా ఎంసీఐ తనిఖీకి బెడ్ ఆక్యుపెన్సి కేవలం 52.97 శాతం మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ఓపీడీ రిజిస్ట్రేషన్ కౌంటర్ కంప్యూటరైజ్డ్ చేయలేదని స్పష్టం చేశారు. ఓజీ కోసం ప్రత్యేక క్యాజువాలిటీ లేదని తెలిపారు. సెంట్రల్ ఆక్సిజన్‌తోపాటు వాటిని పీల్చే పరికరాలు పనిచేయడం లేదని పేర్కొన్నారు. అనాటమిలో రెండు మృతదేహాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఇతర విభాగాల్లోనూ లోపాలను చూపించారు. వీటన్నిటిని నెలరోజుల్లో రెక్టిఫికేషన్ చేసుకోవాలి స్పష్టం చేశారు. కాగా కేవలం ఫ్యాకల్టీ విషయంలోనే ఎంసీఐ లోపం ఎత్తిచూపుతూ మళ్లీ వచ్చేసరికి దీన్ని సరిచేస్తామని తేలికగా చెబుతూ ఎంసీఐ తనిఖీలు నిరంతరం కొనసాగేవే అన్నట్లు రిమ్స్ వర్గాలు వ్యవహరించడం నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. మళ్లీ తనిఖీ ఉంటుంది.. రిమ్స్‌లో మళ్లీ ఎంసీఐ తనిఖీ ఉంటుంది. ప్రధానంగా ఫ్యాకల్టీ లేరని ఎంసీఐ నివేదికలో చూపించింది. ఈ లోపాలను సరిచేసుకుంటాం. మళ్లీ రూ.3లక్షల ఫీజు చెల్లిస్తాం. తద్వారా మళ్లీ తనిఖీలకు బృందం వస్తుంది. ప్రధానంగా ప్రొఫెసర్ 14, అసోసియేట్ ప్రొఫెసర్ 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10శాతం కంటే తక్కువ పోస్టులు ఖాళీగా ఉంటే ఎంసీఐ పెద్దగా ప్రాధాన్యత తీసుకోదు. రిమ్స్‌లో 18 శాతం ఖాళీలు ఉండడంతోనే ఈ పరిస్థితి ఎదురైంది. వాటిని సరిదిద్దుతాం. గతంలో పోస్టులను భర్తీ చేసినప్పటికీ పలువురు సెలవుల్లో ఉన్నారు. మరికొంతమంది బదిలీపై వెళ్లడం జరిగింది. – రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ -
రిమ్స్‌పై సవతి ప్రేమ!
పేరు గొప్ప.. ఊరు దిబ్బ చందంగా తయారైంది శ్రీకాకుళంలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) పరిస్థితి. ప్రభుత్వ మెడికల్ కళాశాలతోపాటు అందులోనే సర్వజనీన ఆస్పత్రి నడుస్తోంది. అయితే దీన్ని అభివృద్ధి చేసే వారే కరువయ్యారు. ప్రస్తుత పాలకులు సవతి ప్రేమ చూపిస్తుండడంతో అభివృద్ధి ఆనవాళ్లు మచ్చుకైనా కనిపించడం లేదు. మెడికల్ కళాశాలకు అదనంగా 50 పీజీ సీట్లు మంజూరైనప్పటికీ.. అందుకు తగ్గట్టుగా సౌకర్యాలు లేకపోవడంతో ఈ సీట్లు ఉంటాయో.. పోతాయో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎంసీఐ బృందం పరిశీలనకు రానుంది. ఆ సమయానికైనా సౌకర్యాలు చేకూరుతాయో లేదో తెలియడం పరిస్థితి. అభివృద్ధికి ముందుంటామని పలుమార్లు రిమ్స్‌ను సందర్శించిన అమాత్యుల హామీలు అమలు కాకపోవడం శాపంగా మారింది. శ్రీకాకుళం పాతబస్టాండ్: రిమ్స్ మెడికల్ కళాశాలను దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంజూరు చేశారు. ఆయన అధికారంలో ఉండగానే పనులు చకచకా జరి గాయి. కళాశాలలో ఎంబీబీఎస్ తరగతులు కూడా ప్రారంభించారు. అయితే ఆయన మరణం తరువాత పాలనా పగ్గాలు చేపట్టిన వారు కళాశాలను, ఆస్పత్రిని నిర్లక్ష్యం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కనీస వసతులు కానరావడం లేదు. మంజూరైన పనులు నత్తనడకన సాగుతున్నా యి. ఫలితంగా రిమ్స్ అంటే ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందనే భావ న ప్రజల్లో నెలకొంది. దీనికంటే వెనుక వచ్చిన ప్రైవేట్ మెడికల్ కళాశాలలో పీజీ సీట్లు, ఆదనపు ఎం బీబీఎస్ సీట్లు పెరిగాయి. రిమ్స్‌కి మాత్రం అతీగతీ లేదు. గడచిన నాలుగేళ్లలో జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర వైద్య ఆరో గ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ లు పలుమార్లు రిమ్స్‌ని సందర్శిం చారు. అన్ని వసతులు కల్పిస్తామని, పీజీ సీట్లు మం జూరు చేసి, సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు వీలుగా వైద్యులను నియమిస్తామని ఇచ్చిన హమీలు కార్యరూపం దాల్చలేదు. అదనపు సీట్లకు తగ్గట్టుగా కానరాని సౌకర్యాలు రిమ్స్ మెడికల్ కళాశాల ఇప్పటికే వంద ఎంబీబీఎస్ సీట్లతో నడుస్తోంది. మరో 50 సీట్లు ప్రభుత్వం మం జూరు చేసింది. రిమ్స్‌లో సూపర్ స్పెషాలిటీ వసతులు పెరగాలంటే వివిధ విభాగాల్లో పీజీ సీట్లు రావాల్సింది. ప్రస్తుతం ఒక్క విభాగంలోనే పీజీ సీట్లు ఉన్నా యి. పూర్తిస్థాయిలో మెరుగైన వైద్యం, స్పెషాలిటీ వై ద్యులు, ప్రొఫెసర్లు ఉండాలంటే కనీసం 12 విభాగా ల్లో పీజీ సీట్లు మంజూరు కావాల్సి ఉంది. అయితే అందుకు తగిన వసతులు, విభాగాల వారీగా ప్రొఫె సర్లు రిమ్స్‌లో లేరు. అదనపు సీట్ల మంజూరుకి కావా ల్సిన వసతులు కల్పించాచడంతోపాటు అదనంగా మంజూరైన సీట్లకి తగ్గట్టుగా వసుతులు పెంచాల్సి ఉంది. నత్తనడకన పనులు! రిమ్స్‌లో వసతుల కొరత ప్రస్తుతం వేధిస్తోంది. అదనపు సీట్లు వస్తే ఆ విద్యార్థులు ఎక్కడ ఉండాలో తెలి యని పరిస్థితి. రిమ్స్ మెడికల్ కళాశాలకు 13 బ్లాకులు మంజూరయ్యాయి. గడిచిన పదేళ్లుగా కేవలం 9 బ్లాకులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన నాలుగు నిర్మాణం దశలోనే ఉన్నాయి. ఇటీవల మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ బాబ్జీ వీటిని పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. దీనికి ఇంజినీరింగ్ అధికారులు ఈ నెలలో అప్పగిస్తామని హామీ ఇచ్చినా.. పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. నిధులు విదల్చని చంద్రబాబు సర్కార్ అదనంగా పెంచిన 50 సీట్లలో చేరే విద్యార్థులకు కావాల్సిన వసతుల కోసం ప్రభుత్వం 60 కోట్ల రూపాయలను కేటాయించింది. వీటిలో 60 శాతం, 40 శాతం వంతున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చాలి. ఇందులో తొలి విడతలో కేంద్ర ప్రభుత్వం వాటాలోని 36 కోట్ల రూపాయలకు రూ. 9 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ. 24 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ రూపాయి కూడా విదల్చలేదు. ఈ నిధులు వస్తేగాని అదనపు వసతుల కల్పన సాధ్యంకాదు. ఈ నిధులతోనే అదనపు సీట్లలో చేరే 50 మంది విద్యార్థులకు ప్రసుతం ఉన్న మహిళా వసతి గృహం బ్లాకుపై మూడో ఫ్లోర్ వేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోడంతో ఈ పనులకు సంబంధించి ఎలాంటి చర్యలు ముందుకు సాగలేదు. ఈ పరిస్థతుల్లో 50 అదనపు సీట్లు ఈ ఏడాది వచ్చే అవకాశం లేదనే అభిప్రాయం అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. అన్ని వసతులు పూర్తయితే 2019లో ప్రవేశాలు జరగవచ్చు. పీజీ సీట్లు వచ్చేనా? రిమ్స్ మెడికల్ కళాశాలకు పీజీ సీట్లు అందని ద్రాక్షగా మారాయి. పీజీ సీట్ల కోసం రెండేళ్ల క్రితం ఆరు విభాగాలకు అధికారులు ప్రభుత్వానికి ధరావత్తు చెల్లించారు. అయితే ఒక్క ఫిజియాలజీ సీటు మాత్రమే వచ్చింది. మిగిలిన సీట్లు రాలేదు. దీనికి చెల్లించిన ధరావత్తును రిమ్స్ అధికారులు నష్టపోయారు. దీనితో పాటు పీజీ సీట్ల కోసం దరఖాస్తు చేసిన ప్రైవేటు మెడికల్ కళాశాలకు ముడు విభాగాల్లో సీట్లు మంజూరు కావడం గమనార్హం. ఈ ఏడాది రిమ్స్‌కు పీజీ సీట్లు కావాలంటే అధికారులు ఏప్రిల్‌లో దరఖాస్తు చేయాల్సి ఉండడంతో అధికారులు అందుకుతగ్గట్టుగా సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్‌లో ఎంసీఐ బృందం రాక! భారత వైద్యవిధాన మండలి (ఎంసీఐ) బృందం త్వరలో రిమ్స్ పరిశీలనకు రానుంది. ఏప్రిల్ నెలలో రానున్నట్టు అధికారులకు సమాచారం ఉంది. బృందం వచ్చే సమయానికి వసతులు, బోధన, బోధనేతర సిబ్బందిని సిద్ధం చేయాలి. అలాగే ఎంబీబీఎస్‌లో అదనంగా 50 సీట్లు పెంపునకు తగ్గట్టుగా వసతులు కల్పించాలి. దీనికి సంబంధించిన పూర్తి నివేదికలు సమర్పించకపోతే అదనంగా వచ్చే సీట్లకు ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రధానంగా విద్యార్థులు ఉండేందుకు కావాల్సిన బ్లాకుల నిర్మాణం చేయాలి. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. అందుకు కావాల్సిన నిధులు మంజూరు చేయాలి. -
వైద్యులు వచ్చేస్తున్నారు..
► పోస్టుల భర్తీకి ప్రభుత్వం సుముఖత ► జిల్లాలోని పీహెచ్‌సీల్లో 14 పోస్టులు ఖాళీ ► రిమ్స్ వైద్య కళాశాలలో అదే పరిస్థితి ► వైద్యుల భర్తీతో సేవలు మెరుగు ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో వైద్యుల కొరతతో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పీహెచ్లతో పాటు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో సైతం వైద్యులు లేక ఇబ్బందులు పడుతున్నారు. సరైన వైద్య సేవలు అందక రోగులు హైదరాబాద్, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్తున్నారు. వర్షాకాలంలో వ్యాధుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో సరిపడా వైద్యులు, సిబ్బంది లేక చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ప్రభుత్వం వైద్యులను నియమించేందుకు ప్రక్రియ ప్రారంభించడంతో జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2118 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. ఈ పోస్టులు భర్తీ చేసేందుకు త్వరలో పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్యుల పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఫైల్‌పై సంతకం చేశారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వరి తివారికి పంపించారు. ఆయన సంతకం చేసి టీఎస్సీపీఎస్సీకి పంపిస్తారు. ఈ నేపథ్యంలో టీఎస్సీపీఎస్సీ నిర్ణయంతో త్వరలో ఈ పోస్టులకు భర్తీ కానున్నాయి. దీంతో జిల్లాలోని వైద్యుల పోస్టులతో పాటు, రిమ్స్ మెడికల్ కళాశాలలో సైతం పోస్టులకు మోక్షం కలగనుంది. జిల్లాలో అందని సేవలు.. జిల్లాల పునర్విభజన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలోని వైద్యశాఖలో ఖాళీల కొరత వేధిస్తోంది. వైద్యులతో పాటు, సిబ్బంది కొరతతో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాలు, మలేరియా, డెంగ్యు, రక్తహీనత వంటి వ్యాధులతో ప్రతి ఏడాది ఎంతో మంది చనిపోతున్నారు. వైద్యశాఖలో ఖాళీలు భర్తీ చేయకుండా జాప్యం చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆదిలాబాద్‌లో 22 పీహెచ్‌సీల పరిధిలో మొత్తం 14 వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యాధికారుల పోస్టులతో పాటు నర్సులు, ఏఎన్ ఎంలు, ఫిజియోథెరఫిస్టులు, ల్యాబ్‌టెక్నీషియన్ లు, ప్రజారోగ్య సహాయకులు, తదితర పోస్టులు సుమారు 100 వరకు ఖాళీగా ఉన్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. చిన్నచిన్న విషయాలకు కూడా రిమ్స్‌కు రావడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యుల భర్తీ ప్రక్రియ చేపట్టడంతో సిబ్బంది పోస్టులు కూడా భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. రిమ్స్‌లోనూ అదే పరిస్థితి.. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వైద్య విద్యా సంచాలకుల పరిధిలో సైతం పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 125 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 65 ట్యూటర్లు, 150 సివిల్ సర్జన్ లు, 10 డెంటల్ సర్జన్ ల పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. దీంతో జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ట్యూటర్లను నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం రిమ్స్‌లో 151 పోస్టులకు గాను ఇద్దరు ప్రొఫెసర్లు, 21 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 20 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 50 మంది ట్యూటర్లు సేవలందిస్తున్నారు. ఇంకా 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం భర్తీ ప్రక్రియ ప్రారంభించడంతో రిమ్స్‌లో ఖాళీలు భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సేవలు మెరుగుపడుతాయి.. ప్రస్తుతం పీహెచ్‌సీల్లో ఉన్న వైద్య పోస్టులు భర్తీ చేయడం వల్ల వైద్య సేవలు మరింత మెరుగుపడుతాయి. కొన్ని పీహెచ్‌సీల్లో రెండు వైద్య పోస్టులకు ఒక్కోటి మాత్రమే భర్తీ చేశారు. వాటితో పాటు మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర సిబ్బందిని సైతం నియమిస్తే బాగుటుంది. – సాధన, అడిషనల్ డీఎంహెచ్‌వో -
రిమ్స్‌లో మెడికో ఆత్మహత్యాయత్నం
- వైద్యుడు లైంగికంగా వేధించాడని ఆరోపణ - ఆస్పత్రి భవనం పైనుంచి దూకేందుకు ప్రయత్నం ఆదిలాబాద్ రిమ్స్ : వైద్యుడి వేధింపులు తట్టుకోలేక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాల లో రెండో సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థిని స్రవంతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంచిర్యాల మం డలం తర్లపాడుకు చెందిన మెడికో స్రవంతి ఆత్మహత్య చేసుకుంటానంటూ శనివారం రిమ్స్ ఆస్పత్రి ఓపీ భవ నం ఎక్కింది. దీంతో అక్కడి సిబ్బంది, తోటి విద్యార్థులు ఆమెను అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి ఆమెతో మాట్లాడి కిందకు దించారు. రిమ్స్‌లో పనిచేస్తున్న జనరల్ ఫిజీషియన్ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని స్రవంతి ఆరోపించింది. మానసికంగా కుంగిపోయానని, అందుకే ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించానని చెప్పింది. తల్లిదండ్రులు కూడా తాను చెప్పింది నమ్మకపోవడంతో మనస్తాపం చెందినట్లు పేర్కొంది. తండ్రి మధునయ్యకు సమాచారం అందించడంతో ఆయన వెంటనే వచ్చారు. తన కూతురు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలిపినట్లు టూటౌన్ ఎస్సై విష్ణు తెలిపారు. వారితో మాట్లాడి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు పంపించినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఆమె ఆరోపణల వెనుక ఎంత వరకు వాస్తవం ఉందనేది ఆమె పరిస్థితిలో మార్పు వస్తే తప్ప వాస్తవం తెలియదు. స్రవంతి మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని రిమ్స్ ఇన్చార్జి డెరైక్టర్ అనంత్‌రావు తెలిపారు. ఇప్పటికే సైకియార్టిస్టు వద్ద చికిత్స తీసుకుంటోందన్నారు. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేసిందని పేర్కొన్నారు. చికిత్స తీసుకొని సాధారణ పరిస్థితికి వచ్చిన తర్వాత దీనిపై విచారణ చేపడతామని ఆయన పేర్కొన్నారు. -
నర్సింగ్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ?
ఆరోపణలపై విచారణకు ఆదేశించిన డీఎంఈ ఒంగోలు సెంట్రల్: రిమ్స్‌లో నిర్వహిస్తున్న నర్సింగ్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని అన్ని జీఎన్ఎం కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న నర్సింగ్ విద్యార్థులకు ఈ నెల 28 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకూ నర్సింగ్ పరీక్షలను రిమ్స్‌లోని వైద్య కళాశాలలో నిర్వహిస్తున్నారు. అయితే రిమ్స్‌లో నర్సింగ్ పరీక్షల కోసం ఒక్కో విద్యార్థి నుంచి వెయ్యి రూపాయల వరకూ వసూలు చేసిన నర్సింగ్ కళాశాలల యాజమాన్యాలు, వీటిని రిమ్స్ నర్సింగ్ పరీక్షలు నిర్వహించే అధికారులకు అందజేసిన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో వైద్యకళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ పరీక్షల సూపరింటెండెంట్‌గా ఉండటంతో కాపీయింగ్‌కు పెద్దగా అవకాశం ఉండేది కాదు. ప్రస్తుతం ఆయన రాజీనామా చేయడంతో అధికారులు పని సులువైంది. మొదటి సంవత్సరం నర్సింగ్ విద్యార్థులు 600 మంది, రెండో సంవత్సరం 383 మంది, మూడో సంవత్సరం విద్యార్థులు 370 మంది ప్రస్తుతం పరీక్షలకు హాజరవుతున్నారు. మొత్తం 1353 మంది రిమ్స్‌లో శుక్రవారం నుంచి పరీక్షలు రాస్తున్నారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో కళాశాలల యాజమాన్యాలు వసూలు చేసి రిమ్స్ పరీక్షల అధికారులకు అందించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శనివారం నర్సింగ్ రెండో సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సమయంలో రిమ్స్ డైరక్టర్ డాక్టర్ అంజయ్య తనిఖీలకు రావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున తమ వద్ద ఉన్న కాపీలను చెత్త బుట్టలు, పక్కన ఉన్న బ్లాకుల్లో పడేశారు. తనిఖీ అనంతరం విద్యార్థులు యథావిధిగా కాపీలు కొట్టినట్లు సమాచారం. అయితే నర్సింగ్ పరీక్షల అధికారిగా ఉన్న కేసీటీ నాయక్ ఈ ఆరోపణలపై స్పందిస్తూ బుట్టల్లో ఉన్న కాపీలో ప్రస్తుతం జరుగుతున్న నర్సింగ్ పరీక్షలవి కావని, గత వారం పరీక్షలు జరిగిన ఏఎన్ఎం విద్యార్థులవని తెలిపారు. ప్రస్తుత విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడటం లేదని, విద్యార్థుల వద్ద నుంచి ఎటువంటి నగదు వసూలు చేయలేదని చెప్పారు. ఇప్పటికే ఈ వివాదం హైదరాబాద్ వరకూ వెళ్లింది. దీనిపై మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ డాక్టర్ శాంతారావు, రిమ్స్ డైరక్టర్ అంజయ్యను ప్రశ్నించినట్లు సమాచారం. విజయవాడ సిద్దార్ధ వైద్య కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యకుమారిని విచారణాధికారిగా నియమించారు. ఆమె శనివారం ఒంగోలు వచ్చి ఈ మాస్ కాపీయింగ్‌పై విచారణ జరిపారు. -
ర్యాగింగ్ సాంఘిక దురాచారం
రిమ్స్‌క్యాంపస్: ర్యాగింగ్‌కు దూరంగా విద్యార్థులు ఉండాలని రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ టి.జయరాజ్ అన్నారు. ర్యాగింగ్ అనేది సాంఘిక దురాచారమని, దీనికి కఠిన శిక్షలు ఉన్నాయన్నారు. రిమ్స్ వైద్య కళాశాల సమావేశ మందిరంలో యాంటీ ర్యాగింగ్ సమావేశం సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలు ఉన్నాయని, జైలు శిక్ష పడే అవకాశముందన్నారు. ఇదే జరిగితే విద్యార్థులు అమూల్యమైన భవిష్యత్‌ను కోల్పోతారన్నారు. ర్యాగింగ్ అనే సాంఘిక దురాచారానికి విద్యార్థులు దూరంగా ఉండాలని హితవు పలికారు. -
డాక్టర్ పట్టా అందేనా !
ఒంగోలు సెంట్రల్: స్థానిక రిమ్స్ వైద్య కళాశాలలో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. కళాశాలకు ప్రారంభ అనుమతులు మొదలైన నాటి నుంచి ఎన్నో రకాల ఆటంకాలతో విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపలేకపోతున్నారు. ముఖ్యంగా రిమ్స్ నిర్మాణాల వ్యవహారం వారి భవితకు గుదిబండగా మారింది. ప్రస్తుతం రిమ్స్ వైద్య విద్యార్థులు నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టారు. చివరి ఏడాది అనుమతులపై నీలిమేఘాలు అలముకున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కోర్సు కాలం పూర్తి కావడానికి ఎలాగో ఎంసీఐ అనుమతులు సాధించారు. అయితే ఆ సంస్థ కొన్ని ప్రామాణికాలను కచ్చితంగా అమలు చేయాలని చెప్పింది. దానిలో భాగంగా రిమ్స్‌లో ఆడిటోరియం, క్యాంటీన్, సిబ్బంది క్వార్టర్లు, నర్సింగ్ సూపరింటెండెంట్ కార్యాలయం, 250 మంది విద్యార్థులకు లెక్చర్ హాల్, ఎంబీబీఎస్ విద్యార్థుల వసతి గృహాల్లో అదనపు గదులు, నర్సింగ్ వసతి గృహంలో అదనపు గదులు పూర్తి చేయాలని నిర్దేశించింది. మళ్లీ ఎంసీఐ బృందం వచ్చే మార్చిలో తనిఖీలు చేయనుంది. ఈలోపు ఈ వసతులు పూర్తికాకపోతే విద్యార్థుల డిగ్రీలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నమోదు చేసుకోదు. దీంతో రిమ్స్‌లో చదివిన ఎంబీబీఎస్ విద్యార్థులు తీవ్రం గా నష్టపోతారు. ఇన్ని అనర్ధాలున్నా..రిమ్స్ నిర్మాణాలను వేగవంతం చేసేం దుకు ఏ ఒక్కరూ శ్రద్ధ చూపడం లేదు. చేయాల్సిన పనులివీ... సిబ్బంది క్వార్టర్లు మినహా దాదాపు అన్ని పనులు పునాది దశలోనే ఉన్నాయి. అదనపు వార్డుల కోసం మూడో ఫ్లోర్ నిర్మాణాలను ఇంత వరకు మొదలు పెట్టలేదు. ఈ ఫ్లోర్లో గతంలో నిర్మించిన తాగునీటి ట్యాంకులనే ప్రస్తుతానికి తీసివేసే పనిలో ఉన్నారు. దాదాపు 750 మంది పట్టేందుకు వీలుగా నిర్మించాల్సిన ఆడిటోరియం పనులు నత్తనడకన సాగుతున్నాయి. క్యాంటిన్ ఏర్పాటు చేయాలని దాదాపు 8 నెలల క్రితం జరిగిన హెచ్‌డీఎస్ సమావేశంలో కలెక్టర్, రిమ్స్ అధికారులు తీర్మానించారు. బిల్డ్ అండ్ ఆపరేట్ పద్ధతిపై క్యాంటీన్ నిర్మాణాన్ని వేగవంతం చేయవచ్చని సూచించారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. మార్చి నెలాఖరు వరకు మంజూరైన బడ్జెట్‌తోనే పనులు నత్తనడకన సాగుతున్నాయి. మార్చి అనంతరం ప్రభుత్వం రిమ్స్‌కు బడ్జెట్ కేటాయించలేదు. దీంతో నిధులు అందుబాటులో లేకపోవడం కూడా రిమ్స్ నిర్మాణాలు వేగవంతంగా సాగకపోవడానికి కారణం. నేడు రిమ్స్‌కు రానున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి: రాష్ర్ట వైద్యారోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాస్ నేడు రిమ్స్‌ను సందర్శించనున్నారు. రిమ్స్ నిర్మాణాలను, వసతులు, సదుపాయాలను పరిశీలించి దాని ప్రకారం నిధులు మంజూరు చేయనున్నట్లు సమాచారం. అభ్యంతరాలను పరిష్కరిస్తాం..డాక్టర్ అంజయ్య రిమ్స్ డైరక్టర్ ఎంసీఐ లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు రిమ్స్ డైరక్టర్ డాక్టర్ అంజయ్య తెలి పారు. నిర్మాణాలను వేగవంతం చేసేం దుకు ఏపీహెచ్‌ఎండీసీ ఇంజినీరింగ్ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రిమ్స్ ఉద్యోగులకు వేతనాల్లేవ్ రిమ్స్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, సెమీ అటానమస్, అవుట్ సోర్సింగ్, ఒప్పంద ఉద్యోగులు వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. గత ఏప్రిల్ నుంచి రిమ్స్ ఉద్యోగులకు వేతనాల్లేవు. ఇదేమని అడిగితే ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదని అంటున్నారు. మూడు నెలలకు సంబంధించి రూ.2 కోట్ల వరకు నిధులు రావాల్సి ఉంది. రిమ్స్ ఆస్పత్రి, వైద్య కళాశాలలో సుమారు 275 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరికీ నెలనెలా సుమా రు రూ.65 లక్షలకుపైగా వేతనాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. నిధు లు లేకపోవడం ఒక కారణమైతే..కొన్ని విభాగాల్లో ఉద్యోగులు సకాలంలో బిల్లులు చేయరు. చేసినా..వాటిలో అనేక తప్పులుంటాయి. దీంతో గజిటెడ్ హోదా ఉద్యోగులు తప్పిస్తే ఇతర విభాగాల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎనిమిది నెలల నుంచి ట్రామాకేర్ సిబ్బందికి జీతాల్లేవ్: రిమ్స్ ట్రామాకేర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న దాదాపు 30 మంది సిబ్బందికి 8 నెలలుగా జీతాలివ్వడం లేదు. దీంతో ఈ విభాగంలో పనిచేస్తున్న వారంతా ఆందోళనబాట పట్టా రు. 28 రోజులుగా కలెక్టరేట్ వద్ద జీతాలివ్వాలని రిలే నిరాహార దీక్షలు చేస్తు న్నా.. ఏ అధికారిగానీ, ప్రజాప్రతినిధిగానీ పట్టించుకున్న పాపానపోలేదు. సిబ్బంది ఇచ్చిన వినతిపత్రాలు తీసుకుని కేవలం కంటితుడుపు చర్యగా వేతనాలు అందుతాయని చెబుతున్నారే తప్ప సమస్య పరిష్కారం కాలేదు. అత్యవసర విభాగంలో సిబ్బందితో వెట్టిచాకిరీ చేయించుకుని జీతాల విషయంలో ప్రభుత్వం జాలి తలచడం లేదని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. -
రిమ్స్ వసతి గృహ నిర్మాణాల్లో నాణ్యతా లోపం
ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాల వెనుకాల నిర్మిస్తున్న వసతి గృహ నిర్మాణ పనులు నాసిరకం గా సాగుతున్నాయి. రూ. కోట్లతో మెడికల్ విద్యార్థుల కోసం నిర్మిస్తున్న ఈ భవనాలు నాణ్యతా లోపంతో మున్నాళ్ల ముచ్చటగా మారే అవకాశం ఉంది. వైద్య విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు లేకపోవడం, కొత్తగా వచ్చే విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఈ భవనాలు నిర్మిస్తున్నారు. మట్టి ఇసుక, తక్కువ మోతాదులో సిమెంట్, కాంక్రీట్ వేయడం.. కాంట్రాక్టరు, అధికారులు ములాఖత్ కావడంతో భవిష్యత్తులో కూలిపోయే ప్రమాదం ఉంది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పలువురు కోరుతున్నారు. రూ.19 కోట్లతో నిర్మాణం రిమ్స్ మెడికల్ విద్యార్థులకు ప్రభుత్వం వసతి గృహా లు నిర్మించేందుకు రూ.19 కోట్లతో పనులు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న బాలికల, బాలుర వసతి గృహాలపైనే మరో అంతస్తులో వీటిని నిర్మిస్తున్నారు. 48 గదుల నిర్మాణాల్లో భాగంగా ప్రస్తుతం స్లాబ్‌లెవల్ పూర్తికావస్తోంది. ప్రస్తుతం రిమ్స్ వసతి గృహాల్లో 500 మంది మెడికోలు ఉంటున్నారు. ఒక గదిలో కేవలం ఇద్దరు వి ద్యార్థులు ఉండాలి. వీరికి సరిపడా గదులు లేకపోవడం తో ఒక్కో గదిలో ముగ్గురేసి విద్యార్థులు ఉంటూ అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న గదులు వచ్చే విద్యా సంవత్సరంలో రిమ్స్‌కు వచ్చే 100 మంది మెడికల్ విద్యార్థులకు కేటాయించనున్నారు. వసతి గృహాల నిర్మాణాల్లో నాణ్యతా లోపిస్తే.. ఏదైన జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వైద్య విద్యార్థుల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. నాణ్యతాలేమి.. వసతి గృహ నిర్మాణ పనుల్లో కాంట్రాక్టరు నాణ్యతా పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టి ఇసుకను, తక్కువ మోతాదులో కాంక్రీట్, సిమెంట్‌ను వాడుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం గోదావరి ఇసుక వాడాల్సి ఉన్నాస్థాని కంగా లభ్యమవుతున్న మట్టి ఇసుకతో నిర్మాణం చేపడుతున్నారు. తక్కువ మొత్తంలో నాణ్యమైన ఇసుకను వాడుతుండగా.. దానికంటే ఎక్కువ మొత్తంలో మట్టి ఇ సుకను ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఇసుక స్టాక్ రావడం లేదనే సాకుతో గదుల ని ర్మాణం గోడలకు పాత మట్టి ఇసుకను వాడుతున్నారు. భవనాల పిల్లర్లకు ఉపయోగించే కాంక్రీట్‌ను తక్కువ మొత్తంలో.. ఇసుకను ఎక్కువ మొత్తంలో కలిపి నిర్మాణాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా పూర్తి చేసిన నిర్మాణాలకు కూడా సరిగా క్యూరింగ్ (నీళ్లు పట్టించడం) చే యడం లేదు. దీంతో నిర్మాణం పూర్తి కాకముందే పగు ళ్లు తేలుతున్నాయి. నిర్మాణాల్లో నాణ్యత పాటించకపోవడంతో సంవత్సరాల తరబడి చెక్కు చెదరకుండా ఉం డాల్సిన భవనాలు ఆదిలోనే కూలిపోయే ప్రమాదం ఉందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. పర్యవేక్షించాల్సిన ఇంజినీరింగ్ అధికారులు దీనిపై దృష్టి సా రించడం లేదు. ఈ విషయంపై రిమ్స్ ఇగ్జిక్యూటివ్ ఇం జినీర్ కృష్ణయ్యను అడుగగా వసతి గృహ నిర్మాణం ప నుల్లో ఎటువంటి నాసిరకం పనులు జరుగడం లేదని, పారదర్శకంగా పనులు కొనసాగుతున్నాయన్నారు. -
3ముప్పై అడిగితే
రిమ్స్ క్యాంపస్, న్యూస్‌లైన్: ఇద్దరు కేంద్ర మంత్రులు.. మరో ఇద్దరు రాష్ట్ర మంత్రులు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులోనూ ఒకరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. అయినా జిల్లా పెద్దాస్పత్రి అయిన రిమ్స్‌కు మేలు చేసేందుకు తమ పరపతిని ఏమాత్రం ఉపయోగించలేదు. ఫలితంగా రిమ్స్ వైద్య కళాశాలకు పీజీ సీట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగింది. 13 విభాగాలకు సంబంధించి 30 సీట్లు మంజూరు చేయాలని కోరగా ఫిజియాలజీ విభాగంలో 3 సీట్లు మాత్రమే కేటాయించారు. రిమ్స్ ఏర్పాటును తమ ఘనతగా ప్రచారానికి ఉపయోగించుకుంటున్న మంత్రులు, ఇతర అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దాని అభివృద్ధి విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపడంలేదు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లాలో రిమ్స్ ఏర్పాటు కాగా తమ ఘనతగానే ఇప్పటికీ నాయకులు చెప్పుకొంటున్నారు. వాస్తవానికి వైఎస్ అనంతరం దాని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదు. ఆరేళ్లు గడిచినా పూర్తికాని నిర్మాణ పనులే దానికి నిదర్శనం. 13 డిపార్టుమెంట్లలో 30 పీజీ సీట్లు మంజూరు చేయాలని కోరుతూ రిమ్స్ అధికారులు భారతీయ వైద్య మండలికి ప్రతిపాదనలు పంపారు. ఆ మేరకు మండలి సభ్యులు ఇటీవల రిమ్స్‌ను పరిశీలించారు. అయితే సీట్ల మంజూరు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య మంత్రి కోండ్రు మురళీమోహన్ విఫలం కావడంతో రాష్ట్రానికి అతి తక్కువ పీజీ సీట్లు మంజురయ్యాయి. మొత్తం 105 సీట్లు మంజురైతే వాటిలో 23 మాత్రమే ప్రభుత్వ వైద్య కళాశాలలకు మంజురు చేశారు. అందులో శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాలకు మొహమాటానికన్నట్లు 3 సీట్లు మాత్రమే కేటాయించడంపై అటు వైద్య విద్యార్థులు, ఇటు అధికారులు పెదవి విరుస్తున్నారు. జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు శ్రద్ధ చూపకపోవడం వల్లే ఈ అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు ఏం చేస్తున్నట్లు? జిల్లా నుంచి కిల్లి కృపారాణి, వైరిచర్ల కిశోర్‌చంద్ర దేవ్ కేంద్ర మంత్రులు ఉన్నారు. అలాగే కోండ్రు మురళీమోహన్, శత్రుచర్ల విజయరామరాజు రాష్ట్ర మంత్రులుగా అధికార భోగం అనుభవిస్తున్నారు. వీరంతా కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉంటే పీజీ సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖకే మంత్రిగా ఉన్న కోండ్రు మురళీ మోహన్ ఉదాసీనత వహించారన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాకు అన్యాయం జరుగుతుంటే ఇంత మంది మంత్రులు ఏం చేస్తున్నట్లని పలువురు ప్రశ్నిస్తున్నారు. పీజీ సీట్ల రెండో జాబితా విడుదలయ్యే అవకాశాలున్నప్పటికీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం చూస్తుంటే ఈ మూడు సీట్లతే సరిపెడతారన్న అనుమానం వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి ఆ మూడే: రిమ్స్ డెరైక్టర్ రిమ్స్ వైద్య కళాశాలలో మొత్తం 13 డిపార్టుమెంట్లకు 30 పీజీ కోర్సు సీట్ల కోసం ప్రతిపాదనలు పంపాం. అయితే 3 సీట్లే మంజూరు చేశారు. తర్వాత రెండో జాబితా వచ్చే అవకాశమున్నా అదనపు సీట్లు ఇస్తారో లేదో తెలియదని రిమ్స్ డెరైక్టర్ టి.జయరాజ్ ‘న్యూస్‌లైన్’తో అన్నారు. -
రిమ్స్‌లో వైద్యుల పోస్టుల భర్తీ ప్రక్రియను అడ్డుకున్న: టీఆర్ఎస్
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : స్థానిక రిమ్స్ వైద్య కళాశాలలో వైద్యుల పోస్టుల భర్తీకి శనివారం నిర్వహించిన ఇంటర్వ్యూలకు తెలంగాణ సెగ తగిలింది. ఉదయమే అభ్యర్థులు అధిక సంఖ్యలో ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న, టీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకుని రిమ్స్ డెరైక్టర్ శశిధర్‌తో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడే వరకూ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టవద్దని ఇంటర్వ్యూలను అడ్డుకున్నారు. ఇంటర్వ్యూల నిర్వహణకు హైదరాబాద్ నుంచి వచ్చిన అడిషనల్ డీఎంఈ డాక్టర్ రాజుతో మాట్లాడి ఇంటర్వ్యూలు నిలిపివేసే విషయమై చర్చించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్వహిస్తే ఈ ప్రాంత వైద్యులకు ప్రయోజనం చేకూరుతుందని, ఇప్పుడే నిర్వహిస్తే ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు వచ్చే అవకాశాలు ఉంటాయని అడిషనల్ డీఎంఈకి వినతిపత్రం అందజేశారు. దీంతో ఇంటర్వ్యూలు నిలిపివేస్తున్నట్లు అడిషనల్ డీఏంఈ రాజు ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే రామన్న మాట్లాడుతూ సీమాంధ్రులు కడప, శ్రీకాకుళం జిల్లాల్లోని రిమ్స్‌లో వైద్యుల ఇంటర్వ్యూలను అడ్డుకున్నారని, ఈ సమయంలో ఇక్కడ ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా ఆ ప్రాంతం వారు వచ్చే అవకాశం ఉందని అన్నారు. కడప, శ్రీకాకుళం రిమ్స్‌లకు త్రైమాసిక బడ్జెట్ రూ.50 లక్షలకు పైగా విడుదల చేస్తే ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి రూ.25 లక్షలు మాత్రమే విడుదల చేసి వివక్ష చూపారని తెలిపారు. రిమ్స్ వైద్యులతోపాటు, రిమ్స్ డెరైక్టర్ పోస్టులో కూడా తెలంగాణ వారే ఉండాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, పట్టణ అధ్యక్షుడు సాజిదొద్దీన్, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బండారి సతీష్, మావల గ్రామ సర్పంచ్ రఘుపతి, టీఆర్ఎస్ నాయకులు బాదం గంగన్న, రామోజీ ఆంజనేయులు, కస్తాల ప్రేమల, ఆనంద్, ఉరుస్‌ఖాన్, సాయికృష్ణ పాల్గొన్నారు.