
సాక్షి, వైఎస్సార్ జిల్లా : పోలీసు శాఖ ఆధ్వర్యంలో రిమ్స్ మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాలు అరికట్టే విధంగా డేగ కళజాత బృందం ఆధ్వర్యంలో నాటకాన్ని ప్రదర్శించారు. జిల్లా ఎస్పీ అభిషేక్ మొహంతి, కడప డీఎస్పీ సూర్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ సదస్సులో రిమ్స్ మెడికల్ విద్యార్థులు భారీగా హాజరయ్యారు.