ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాల వెనుకాల నిర్మిస్తున్న వసతి గృహ నిర్మాణ పనులు నాసిరకం గా సాగుతున్నాయి. రూ. కోట్లతో మెడికల్ విద్యార్థుల కోసం నిర్మిస్తున్న ఈ భవనాలు నాణ్యతా లోపంతో మున్నాళ్ల ముచ్చటగా మారే అవకాశం ఉంది. వైద్య విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు లేకపోవడం, కొత్తగా వచ్చే విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఈ భవనాలు నిర్మిస్తున్నారు. మట్టి ఇసుక, తక్కువ మోతాదులో సిమెంట్, కాంక్రీట్ వేయడం.. కాంట్రాక్టరు, అధికారులు ములాఖత్ కావడంతో భవిష్యత్తులో కూలిపోయే ప్రమాదం ఉంది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పలువురు కోరుతున్నారు.
రూ.19 కోట్లతో నిర్మాణం
రిమ్స్ మెడికల్ విద్యార్థులకు ప్రభుత్వం వసతి గృహా లు నిర్మించేందుకు రూ.19 కోట్లతో పనులు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న బాలికల, బాలుర వసతి గృహాలపైనే మరో అంతస్తులో వీటిని నిర్మిస్తున్నారు. 48 గదుల నిర్మాణాల్లో భాగంగా ప్రస్తుతం స్లాబ్‌లెవల్ పూర్తికావస్తోంది. ప్రస్తుతం రిమ్స్ వసతి గృహాల్లో 500 మంది మెడికోలు ఉంటున్నారు. ఒక గదిలో కేవలం ఇద్దరు వి ద్యార్థులు ఉండాలి.
వీరికి సరిపడా గదులు లేకపోవడం తో ఒక్కో గదిలో ముగ్గురేసి విద్యార్థులు ఉంటూ అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న గదులు వచ్చే విద్యా సంవత్సరంలో రిమ్స్‌కు వచ్చే 100 మంది మెడికల్ విద్యార్థులకు కేటాయించనున్నారు. వసతి గృహాల నిర్మాణాల్లో నాణ్యతా లోపిస్తే.. ఏదైన జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వైద్య విద్యార్థుల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది.
నాణ్యతాలేమి..
వసతి గృహ నిర్మాణ పనుల్లో కాంట్రాక్టరు నాణ్యతా పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టి ఇసుకను, తక్కువ మోతాదులో కాంక్రీట్, సిమెంట్‌ను వాడుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం గోదావరి ఇసుక వాడాల్సి ఉన్నాస్థాని కంగా లభ్యమవుతున్న మట్టి ఇసుకతో నిర్మాణం చేపడుతున్నారు. తక్కువ మొత్తంలో నాణ్యమైన ఇసుకను వాడుతుండగా.. దానికంటే ఎక్కువ మొత్తంలో మట్టి ఇ సుకను ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రస్తుతం ఇసుక స్టాక్ రావడం లేదనే సాకుతో గదుల ని ర్మాణం గోడలకు పాత మట్టి ఇసుకను వాడుతున్నారు. భవనాల పిల్లర్లకు ఉపయోగించే కాంక్రీట్‌ను తక్కువ మొత్తంలో.. ఇసుకను ఎక్కువ మొత్తంలో కలిపి నిర్మాణాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా పూర్తి చేసిన నిర్మాణాలకు కూడా సరిగా క్యూరింగ్ (నీళ్లు పట్టించడం) చే యడం లేదు. దీంతో నిర్మాణం పూర్తి కాకముందే పగు ళ్లు తేలుతున్నాయి.
నిర్మాణాల్లో నాణ్యత పాటించకపోవడంతో సంవత్సరాల తరబడి చెక్కు చెదరకుండా ఉం డాల్సిన భవనాలు ఆదిలోనే కూలిపోయే ప్రమాదం ఉందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. పర్యవేక్షించాల్సిన ఇంజినీరింగ్ అధికారులు దీనిపై దృష్టి సా రించడం లేదు. ఈ విషయంపై రిమ్స్ ఇగ్జిక్యూటివ్ ఇం జినీర్ కృష్ణయ్యను అడుగగా వసతి గృహ నిర్మాణం ప నుల్లో ఎటువంటి నాసిరకం పనులు జరుగడం లేదని, పారదర్శకంగా పనులు కొనసాగుతున్నాయన్నారు.
రిమ్స్ వసతి గృహ నిర్మాణాల్లో నాణ్యతా లోపం
Published Mon, Jul 28 2014 12:18 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement