వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులందరమూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేద్దామని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు.
వైఎస్సార్ సీపీని బలోపేతం చేద్దాం
Published Tue, Feb 11 2014 1:53 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులందరమూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేద్దామని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని న్యూకాలనీలో పార్టీ జిల్లా నూతన కార్యాలయూన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రి ఆశయసాధన కోసం ఒక బాధ్యతగల నాయకుడిగా పనిచేస్తున్న జగన్‌మోహనరెడ్డినాయకత్వంలో మనమంతా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావలసిన బాధ్యత ఉందన్నారు. తనదగ్గరకు వచ్చే నాయకులతో జగన్ ఎంతో ఆప్యాయంగా, ప్రేమతో మాట్లాడుతారన్నారు. దీనిని కొన్ని దినపత్రికలు కఠినంగా వ్యవహరిస్తారని వక్రీకరిస్తూ రాయడం శోచనీయమన్నారు.
సమర్ధవంతుడైన నాయకుడు కొన్ని నిర్ణయాలను అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చినపుడు ఒకింత కఠినంగానే వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని, జగన్‌మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావడం తధ్యమన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ శ్రీకాకుళం నియోజవకర్గ సమన్వయకర్త వై.వి.సూర్యనారాయణ మాట్లాడుతూ సమైక్య శంఖారావసభ విజయవంతం కావడంతో పార్టీకి మంచి ఊపు, ఉత్సాహం వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఎం.వి.పద్మావతి, నర్తు నరేంద్ర, అంధవరపు సూరిబాబు, ధర్మాన రాంమనోహర్‌నాయుడు, గొండు కృష్ణమూర్తి, టి.కామేశ్వరి, అబ్దుల్ రెహమాన్, జె.ఎం.శ్రీనివాస్, హనుమంతు కృష్ణారావు, చల్లా రవికుమార్, మామిడి శ్రీకాంత్, బరాటం నాగేశ్వరరావు, ఆబోతుల రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement