చంద్రబాబు అబద్ధ్దాల పాలనను ఎండగట్టండి
లావేరు: సీఎం చంద్రబాబు అబద్ధాల పాలనను ఎండగట్టాలని వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. లావేరు మండలం సుభద్రాపురం జంక్షన్‌లో బుధవారం జరిగిన వైఎస్సార్ సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. మోసపూరిత హామీలో గద్దెనెక్కిన టీడీపీ ప్రభుత్వం... రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలను ముంచేసిన తీరును వివరించాలన్నారు. ఇప్పుడు కమిటీల పేరుతో పేదల పింఛన్లు, రేషన్ కార్డులు తొలగిస్తున్న వైనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పార్టీల కతీతంగా లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు మంజూరు చేస్తే బాబు సీఎం అయ్యూక తొలగిస్తున్నారని విమర్శించారు.
వైఎస్సార్ సీపీ బీసీసెల్ రాష్ర్ట అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రజలతో ఎన్నుకోబడిన సీఎం అయితే చంద్రబాబు దొడ్డిదారిన మామకు వెన్నుపోటు పొడిచి ఒకసారి, వాజ్‌పేయ్ పేరు చెప్పుకొని మరోసారి, ఇప్పుడు మోడీ చరిష్మాతో సీఎం అయ్యూరని విమర్శించారు. తుపాను పరిహారం అందక, పంటలు సాగుచేసుకునేందుకు పెట్టుబడి లేక రైతులు నానా అవస్థలు పడుతుంటే పట్టించుకోకుండా రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తామంటూ ప్రకటనలు చేయడం, రాజధాని జపం చేస్తూ కాలక్షేపం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ ఇచ్చిన రైతు రుణమాఫీ అమలుచేయూలని జగన్ నిలదీస్తుంటే జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్ననాయుడు జగన్ లక్ష కోట్లు ఇస్తే రైతుల రుణ మాఫీ చేస్తామంటూ ఓ అజ్ఞానిలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
జగన్ లక్షకోట్లిస్తేనే రైతులు, డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో చెప్పారా అంటూ ప్రశ్నించారు. ఆరు నెలల్లోనే పాలన లో టీడీపీ విఫలమైందని, రానున్నవన్నీ వైఎస్సార్ సీపీకి మంచి రోజులేనని తెలిపారు. ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు మాట్లాడుతూ టీడీపీ పాలనలో అన్యాయాలు, వేధింపులు, అరాచకాలు, అక్రమాలు ఎక్కువయ్యూయన్నారు. అధికారులు అధికార పార్టీ ఏజెంట్లుగా పని చేస్తుండడం విచారకరమన్నారు. ఎచ్చెర్ల వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులపై టీడీపీ నాయకుల దాడులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో లావేరు, రణస్థలం, ఎచెర్ల మండలాల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు దన్నాన రాజినాయుడు, పైడి శ్రీనువాసరావు, మాడుగుల మురళీదర్‌బాబా, రణస్థలం ఎఫ్‌ఎస్‌సీఎస్ అధ్యక్షుడు బొంతు సూర్యనారాయణ, రొక్కం బాలకృష్ణ, రాజాపంతుల ప్రకాశరావు, దేశెట్టి తిరుపతిరావు, గొర్లె అప్పలనాయుడు, మీసాల సీతన్నాయుడు, వట్టి సత్యనారాయణ,షేక్‌చాన్‌బాషా, శాంతాటి మురళీకృష్ణ, సర్పంచ్‌లు నడిమింటి కుమారి, బాడిత రాంబాబు, వాల్లె దాలినాయుడు, దురగాసి ధర్మారావు, పెదనాయిని చిట్టిబా బు, మీసాల రామినాయుడు, నాయిని పైడిరెడ్డి, కొల్లి పైడయ్యరెడ్డి, ఎంపీటీసీలు రఘుమండల కృష్ణ, వైఎస్సార్‌సీపీ నాయకులు, వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.