
సాక్షి, అమరావతి: చంద్రబాబు సంస్కారహీనుడని మంత్రి ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఒళ్లంతా అహంకారం, విషం నింపుకుంటేనే ఇలాంటి మాటలు వస్తాయని దుయ్యబట్టారు. ఇకనైనా అబద్ధాల మీద రాజకీయాలు చేయడం మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. చంద్రబాబు ఇంకా భ్రమలోనే ఉన్నారని..ప్రజలు మీ పార్టీని, మిమ్మల్ని పాతాళంలోకి తొక్కేశారన్నారు. ఇలాంటి ప్రేలాపలను ఇంకా కొనసాగిస్తే ప్రజలు అంత కంటే కిందకి తొక్కేస్తారని మండిపడ్డారు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించలేని అసహనం చంద్రబాబు మాటల ద్వారా బయటపడుతుందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు పద్ధతి మార్చుకోవాలని.. లేదంటే ఇంతకంటే దారుణ పరాభవాన్ని రుచి చూపిస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment