సాక్షి, విజయవాడ: రెవెన్యూ ఉద్యోగులు క్షేత్రస్థాయి సమస్యలపై డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో మంగళవారం భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన విషయాలను రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాకు వివరించారు. 'రెవెన్యూ ఉద్యోగుల క్షేత్రస్థాయి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూముల రీ సర్వే చేపడుతోంది. అది ముగిసేవరకు రెవెన్యూ ఉద్యోగులకు వేరే విధులు కేటాయించొద్దని కోరాం.
క్రమశిక్షణ చర్యలకు గురైన ఉద్యోగులపై శాఖాపరమైన విచారణ జరపకుండా కాలయాపన చేస్తున్నారు. ఉద్యోగుల సర్వీస్ పూర్తయిన విచారణలు పూర్తికాక పెన్షన్ కూడా అందుకోలేని పరిస్థితి ఉంది. వీటిపై దృష్టిసారించి వీలైనంత త్వరగా విచారణలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరాం. తహశీల్దార్లుకు నిధులు పూర్తి స్థాయిలో రాక.. వారు పడుతున్న ఇబ్బందులను వివరించినట్లు' బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. (సీఎం జగన్‌ను కలవనున్న దివ్య పేరెంట్స్)
Comments
Please login to add a commentAdd a comment