
జగన్‌మోహనరెడ్డితో కలిసి నడుస్తున్న కృష్ణదాస్
నరసన్నపేట: ప్రజా సంకల్పయాత్రలో భాగం గా 221 వరోజు పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ధర్మాన కృష్ణదాస్ గురువారం కలిశారు.
తూర్పు గోదా వరి జిల్లా పెద్దాపురం దర్గా సెంటర్, కట్టమూరి క్రాస్ రోడ్డుల వద్ద పాదయాత్ర జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించగా దర్గా సెంటర్ నుంచి కొంత దూరం కృష్ణదాస్ అధినేతతో కలసి నడిచారు. ఈ సందర్భంగా నరసన్నపేటలో డెడికేటెడ్ నెట్‌వర్క్ పేరున చేపడుతున్న పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను, ఇటీవల నిర్వహించిన బూత్ కమిటీ సమావేశాల తీరును ఆయనకు వివరించారు. కలసి కట్టుగా పనిచేసి జిల్లాలో పార్టీని మరింతగా బలోపేతం చేయాలని జగన్‌మోహనరెడ్డి కృష్ణదాస్‌కు సూచించారు.