వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్‌గా ధర్మాన కృష్ణదాస్ | Dharmana Krishna das appointed as YSRCP District convenor | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్‌గా ధర్మాన కృష్ణదాస్

Published Fri, Sep 27 2013 3:23 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM

వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్‌గా నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్‌గా నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం రాత్రి తెలిపింది. కృష్ణదాస్ మొదటి నుంచీ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారు. జిల్లాలో పార్టీని ముందుకు నడిపించడంలో తన వంతు పాత్ర  పోషించారు. ఇప్పటివరకు జిల్లా కన్వీనర్‌గా ధర్మాన పద్మప్రియ కృష్ణదాస్ పనిచేశారు. అయితే గ్రామ స్థాయి నుంచి నిర్మాణ పరంగా పార్టీని బలోపేతం చేసేందుకు ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణదాస్ సరైన నాయకుడిగా భావించి జిల్లా బాధ్యతలను అప్పగించారు. 
 
సీఈసీ సభ్యురాలిగా పద్మప్రియ
ఇప్పటివరకు జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించిన ధర్మాన ప్రద్మప్రియ కృష్ణదాస్‌ను కేంద్ర కార్యనిర్వాహక మం డలి(సీఈసీ) సభ్యురాలిగా నియమిం చారు. ప్రస్తుతం సీఈసీలో ఎమ్మెల్యేలు, కొందరు ముఖ్య నాయకులు సభ్యులుగా ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement