అహ్మదాబాద్ : ఫేస్ మాస్క్ లేకుండా బయట యథేచ్ఛగా తిరిగే వాళ్ల నుంచి ఇకపై పోలీసు శాఖ జరిమానా విధించనుంది. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుంటే రూ. 200 జరిమానా విధిస్తారు. ఈ బాధ్యతను ప్రస్తుతం పోలీసు శాఖకు అప్పజెప్పుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వేగంగా ప్రబలుతున్న రాష్ర్టాల్లో గుజరాత్ ఒకటి. వైరస్ విజృంభిస్తున్నా కొందరు మాత్రం ఇష్టారీతిన వ్యవహరిస్తూ నిబందనల్ని గాలికొదిలేస్తున్నారు. కొందరు మున్సిపల్ అధికారులు సైతం ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ బాధ్యతను పోలీసు శాఖ పరిధిలోకి తెచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన వారికి ఇప్పటివరకు కేవలం 280 ఈ చలాన్లను మాత్రమే అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment