
ఆదిలాబాద్ టౌన్: ట్రాఫిక్ పోలీసులు విధిస్తున్న చలాన్లు చెల్లించలేక ఓ వ్యక్తి తన బైక్‌ను తగులబెట్టుకున్నాడు. ఆదిలాబాద్‌లోని ఖానాపూర్‌కు చెందిన ఫరీద్ మక్బుల్(ఏపీ01హెచ్8085) కిసాన్‌చౌక్ మీదుగా బైక్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో కిసాన్‌చౌక్ వద్ద వాహనాలను ఆపుతున్న ట్రాఫిక్ పోలీ సులు అతడిని నిలిపి పెండింగ్ చలానాలు చెల్లించాలని సూచించారు.
ఆవేశంతో తన బైక్ లోని పెట్రోల్ తీసి అదే బైక్‌పై పోసి నిప్పంటించాడు. అక్కడున్న పోలీసులు వాహనంపై నీళ్లు పోసి మంటలు ఆర్పేశారు. మక్బుల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, బైక్‌పై రూ.1,200 మేర చలాన్లు ఉన్నట్లు తెలిసింది. ఇటీవలే రూ.2 వేల చలానా చెల్లించినా, మళ్లీ రూ.1,200 చెల్లించాలని అడిగే సరికి ఆవేశంతో బైక్‌కు నిప్పటించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment