BIKE FIRE
-
బైక్‌కు నిప్పు..!
పాలకవీడు: మండలంలోని సజ్జాపురం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు సోమవారం రాత్రి గ్రామ శివారులో మద్యం సేవించి గొడవపడ్డారని.. ఈ క్రమంలో ఓ బైక్‌ను తగలబెట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ లింగంను వివరణ కోరగా.. సజ్జాపురం గ్రామానికి చెందిన మూగల బాలసైదులు మరో వ్యక్తితో కలిసి సోమవారం రాత్రి బైక్‌పై వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వారిని అడ్డుకుని వారి బైక్‌ను తగలబెట్టినట్లు తెలిపారు. మూగల బాలసైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం మద్యం మత్తులో జరిగిన గొడవకారణంగానే బైక్‌కు నిప్పు పెట్టారా.. లేదా వ్యక్తిగత కక్షతో ఈ ఘటన చోటుచేసుకుందా అనే విషయం తెలియనుంది. -
ఎండకాలంలో జాగ్రత్త..! ఆ టైంలో బైక్‌పై వెళ్లకపోవడమే ఉత్తమం
సాక్షి, ఖిలా వరంగల్: ఎండాకాలం వచ్చిందంటే చాలు భానుడి భగభగలతో మనం అల్లాడిపోతాం. ఉదయం పది దాటితే ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు సాహసించాల్సివస్తోంది. అత్యవసర పరిస్థితిల్లో బయటకు వస్తే దాహం తీర్చుకోవడానికి శీతలపానియాలు, పండ్లరసాలు తీసుకుంటాం. వేసవితాపానికి గురికాకుండా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అదేవిధంగా వాహన దారులు తమ వాహనాల పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు మెకానిక్‌లు. వాహనాల విషయంలో వేసవి జాగ్రత్తలు, సాంకేతిక సమస్యలు అధిగమించేందుకు నిపుణుల సలహాలు అవసరమనే పలువురు మోటారు టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. దూరప్రయాణం వద్దు.. కొంత మంది ద్విచక్రవాహనాలపై దూర ప్రయాణాలు ఇష్టపడతారు. ఎండాకాలంలో దూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. ఎండల్లో ఎక్కువ ప్రయాణించడం వల్ల ఇంజిన్, టైర్లు వేడెక్కుతాయి. టైర్లు పేలే అవకాశం, ఇంజిన్ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బైక్‌లపై తప్పనిసరి పరిస్థితుల్లో దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే మార్గమధ్యలో చల్లటి ప్రదేశాల్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఎండలో పార్కింగ్ చేస్తే అంతే.. వాహనాలను ఎండలో పార్కింగ్ చేస్తే జేబుకు చిల్లు పడడం ఖాయమంటున్నారు నిపుణులు. వేసవిలో వడదెబ్బతగలకుండా మనం ఎన్నో జాగ్రత్తలు పాటిస్తాం. కానీ, మనషులకే కాదు వాహనాలకు కూడా ఎండ తాకిడి ఉంటోంది. రంగు వెలసిపోవడం, పెట్రోలు ఆవిరైపోవడం వంటివి జరుగుతుంది. చదవండి: గుర్తుపెట్టుకోండి.. అలాంటి కాల్స్ చేసిన కటకటాలే! జాగ్రత్తలు.. ఎండలో ఇంజిన్ ఆయిల్ త్వరగా వేడెక్కి పలచనవుతుంది. ఎండాకాలం మొదలవగానే ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడం శ్రేయస్కరం. పెట్రోలు ట్యాంకుపై మందపాటి కవర్ ఉండేటట్టు చూసుకోవడం వల్ల కొంత వరకు పెట్రోలు ఆవిరి కాకుండా తగ్గించుకోవచ్చు. టైర్లు అరిగి ఉంటే మార్చుకోవాలి. ట్యూబ్‌లకు పంక్చర్లు ఉంటే వేసవి కాలంలో మార్చుకోవడం మంచిది. మధ్యాహ్నం ఎండలో ఎక్కువ సమయంలో పార్కింగ్ చేసి ఉంచితే వాహన జీవితకాలం తగ్గుతుంది. వేసవిలో ఇంజిన్ గార్డు తొలగించడం మంచిది. దూర ప్రయాణమైతే బస్సుల్లోనే వెళ్లడం ఉత్తమం. చదవండి: బంజారాహిల్స్: పెళ్లి పేరుతో వంచింది..సహజీవనం చేసి...చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో వాహనం తీయాల్సి వస్తే మధ్య మధ్యన విరామం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంజిన్ వేడి తగ్గుతుంది. రాత్రివేళ ఒకసారి ట్యాంకు మూత తీసి మళ్లీ పెడితే మంచిది. దీంతో గ్యాస్ బయటకు పోయి ఆయిల్ సులువుగా ఇంజిన్లోకి వెళ్తుంది. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం 2నుంచి 4గంటల వరకు ద్విచక్రవాహనంపై ప్రయాణం చేయకపోవడం ఉత్తమం. నీడలో పార్కింగ్ చేయాలి.. వేసవిలో ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం చేయొద్దు. ఎండవేడికి టైర్లు మెత్తపడి గాలిదిగి బైక్ నిలిచిపోతుంది. ప్యాచీలు కరిగి బైక్ అదుపు తప్పే ప్రమాదం ఉంది. ఇంజిన్‌లో శబ్ధం వచ్చి మొరాయిస్తుంది. నీడలో పార్క్‌చేయాలి. – ఎండీ జాఫర్, బైక్ మెకానిక్, వరంగల్ -
చలాన్లు కట్టమన్నారని బైక్‌కు నిప్పు
ఆదిలాబాద్ టౌన్: ట్రాఫిక్ పోలీసులు విధిస్తున్న చలాన్లు చెల్లించలేక ఓ వ్యక్తి తన బైక్‌ను తగులబెట్టుకున్నాడు. ఆదిలాబాద్‌లోని ఖానాపూర్‌కు చెందిన ఫరీద్ మక్బుల్(ఏపీ01హెచ్8085) కిసాన్‌చౌక్ మీదుగా బైక్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో కిసాన్‌చౌక్ వద్ద వాహనాలను ఆపుతున్న ట్రాఫిక్ పోలీ సులు అతడిని నిలిపి పెండింగ్ చలానాలు చెల్లించాలని సూచించారు. ఆవేశంతో తన బైక్ లోని పెట్రోల్ తీసి అదే బైక్‌పై పోసి నిప్పంటించాడు. అక్కడున్న పోలీసులు వాహనంపై నీళ్లు పోసి మంటలు ఆర్పేశారు. మక్బుల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, బైక్‌పై రూ.1,200 మేర చలాన్లు ఉన్నట్లు తెలిసింది. ఇటీవలే రూ.2 వేల చలానా చెల్లించినా, మళ్లీ రూ.1,200 చెల్లించాలని అడిగే సరికి ఆవేశంతో బైక్‌కు నిప్పటించుకున్నాడు. -
చలాన్ల వేధింపులు తట్టుకోలేక బైక్‌కు నిప్పంటించాడు
సాక్షి, ఆదిలాబాద్: ట్రాఫిక్ పోలీసులు చలాన్ల పేరుతో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝులిపిస్తున్న పోలీసులు అన్ని నిబంధనలు పాటించిన వారిపై కూడా ఇష్టం వచ్చినట్లు చలాన్లు విధిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహానికి సంబంధించిన ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. చదవండి: బూజుపట్టిన బాదం మిల్క్.. హెరిటేజ్ స్టోర్ మూసివేత తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల చలాన్ల బాధలు భరించలేక ఓ వ్యక్తి తన మోటార్ సైకిల్‌కు నిప్పు పెట్టాడు. పంజాబ్ చౌరస్తాలో ట్రాపిక్ పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఖానాపూర్‌కు చెందిన మక్బూల్ అనే వ్యక్తి తన బైక్‌కు నిప్పు పెట్టడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. చలాన్లు కట్టిన కూడా తరుచూ కట్టాలని ట్రాఫిక్ పోలీసులు అడుగుతున్నారని, చలానాల బాధలు తట్టుకోలేకే తన బైక్‌కు నిప్పు పెట్టినట్లు మక్బూల్ అవేదన వ్యక్తం చేశారు. చదవండి: 2000 మందికి సున్నా మార్కులు.. నోరెళ్లబెట్టిన విద్యార్థులు, కారణమేంటి? -
ప్రియుడి 23 లక్షల బైక్‌ను తగలబెట్టేసిన ప్రియురాలు
బ్యాంకాక్: ప్రేమ.. మాటల్లో వర్ణించలేని గొప్ప ఫీలింగ్. ఒకరి మనుసు ఒకరు తెలుసుకొని జీవితాంతం తోడుగా నిలవాలని ఎంతో మంది కలలు కంటుంటారు. కానీ తమ ప్రేమను పెళ్లితో మూడేసి నూరేళ్లు జీవించేవాళ్లు కొందరే. మనస్పర్థలు, నమ్మకం కోల్పోవడం వంటి కారణాలతో మధ్యలోనే విడిపోయే వారు కోకొల్లలు. కొంతమంది బలమైన కారణంతో బ్రేకప్ మరికొంతమంది సిల్లీ రీజన్స్‌తో విడిపోతుంటారు. అయితే అచ్చం ఇలాగే థాయ్‌లాండ్‌కు చెందిన ఓ జంట కొంతకాలం ప్రేమించుకున్నారు. ఆ సమయంలో కనాక్ వావన్ అనే యువతి తన లవర్‌కు లక్షల విలువైన బైక్‌ను గిఫ్ట్‌గా అందించింది. తరువాత కొన్ని కారణాలతో వారు విడిపోయారు. అయితే తను ఇచ్చి బైక్‌ను తిరిగి ఇవ్వాలని యువతి అతన్ని కోరింది. ఇందుకు యువకుడు నిరాకరించాడు. దీంతో ఎలాగైన మాజీ ప్రేమికుడిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఓ ప్లాన్ వేసింది. బ్యాంకాక్‌లోని ఓ భవనం మూడో అంతస్తులో ప్రియుడి బైక్ పార్క్ చేసి ఉందని తెలుసుకుంది. అక్కడికి వెళ్లి ఆమె ఇచ్చిన లగ్జరీ బైక్‌ను పెట్రోల్ పోసి తగలబెట్టింది. ఈ క్రమంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. పక్కనే ఉన్న మరో ఆరు బైక్‌లకు కూడా మంటలు అంటుకున్నాయి. అయితే అక్కడున్న సిబ్బంది వెంటనే తెరుకొని అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అనంతరం సీసీ టీవీఫుటేజీని పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ప్రమాదం జరిగడానికి ముందు ఓ మహిళ వచ్చి ఓ బైక్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టడం పోలీసులు గమనించారు. ప్రమాదానికి కనాక్ వావన్ కారణమని తెలుసుకొని ఆమెను అరెస్ట్ చేసి విచారించగా మరిన్ని వివరాలు బయటకొచ్చాయి. ఆ బైక్ ధర ఒక మిలియన్ బాట్ అంట. అంటే మన కరెన్సీలో సుమారు ₹23 లక్షల వరకు ఉంటుంది. ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పుడే ఆమె కొనిచ్చనని, ఇప్పుడు విడిపోవడంతో అతని మీద కోపంతో ఆ బైక్‌ను తగలబెట్టాలని తెలిపింది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: వీడియో వైరల్: భారీగా బరువు తగ్గిన కిమ్ జాంగ్ -
నమస్తే పెట్టలేదని బైక్‌కు నిప్పు..!
బంజారాహిల్స్: తనకు నమస్తే పెట్టలేదని...తనను గౌరవించడం లేదని... చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాడంటూ టీఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకుడు ఓ యువకుడి ద్విచక్ర వాహనాన్ని దగ్ధం చేశాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ సంఘటనలో టీఆర్ఎస్ రహ్మత్‌నగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, వార్డు కమిటీ సభ్యుడు అరుణ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణారెడ్డి, బాధితుడు పి.ఉమాకాంత్ తెలిపిన మేరకు.. రహ్మత్‌నగర్ సమీపంలో నివసించే ఉమాకాంత్(20) శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో సోమాజిగూడలోని తన పాన్షాప్ను మూసేసి రహ్మత్‌నగర్ నల్లపోచమ్మ దేవాలయం సమీపంలో నివసించే తన స్నేహితుడు రాహుల్ ఇంటికి వచ్చి బైక్‌ను పార్కింగ్ చేశాడు. అదే సమయంలో స్థానిక టీఆర్ఎస్ నేత అరుణ్ ఆ ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. ఉమాకాంత్ తనకు నమస్తే పెట్టకుండానే తనను పలకరించకుండా వెళ్ళడమే కాకుండా ఆ ప్రాంతానికి ఎవరెవరినో తీసుకొస్తున్నాడని అరుణ్ కోపం పెంచుకున్నాడు. అదే సమయంలో అరుణ్ కర్ర తీసుకొని కొట్టడానికి వస్తున్నాడంటూ రాహుల్ చెప్పడంతో ఉమాకాంత్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఉమాకాంత్ తన స్నేహితుడైన దుర్గకు సమాచారం ఇచ్చాడు. కొద్ది సేపటికే అరుణ్ తన వాహనంలో ఉన్న పెట్రోల్‌ను సీసాలో నింపి ఉమాకాంత్ బైక్(టీఎస్ 09 ఈడబ్లు 5219)పై పోసి నిప్పంటించాడు. అదే సమయంలో అక్కడికి ఉమాకాంత్, దుర్గ ఇద్దరూ చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న అరుణ్ దుర్గను తన్నాడు. అరుణ్ సోదరుడు అనిల్, మహేష్‌లు అక్కడికి చేరుకొని దుర్భాషలాడారు. కర్రతో కొట్టేందుకు ప్రయత్నించారు. ఇదిలా ఇలా ఉండగా గొడవ జరుగుతున్న సమయంలో అదే దారిలో వెళ్తున్న రౌడీషీటర్ బిల్లా పవన్ గమనించి వెంటనే రహ్మత్‌నగర్ పోలీస్ అవుట్‌పోస్ట్‌లో ఉన్న కానిస్టేబుల్ బాలకృష్ణకు సమాచారం ఇచ్చారు. నైట్ డ్యూటీలో ఉన్న అదే సెక్టార్ ఎస్ఐ శేఖర్ అప్రమత్తమై అక్కడి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని అందరినీ అవుట్‌పోస్టుకు తరలించారు. అయితే పోలీసుల సమక్షంలోనే అరుణ్‌తో పాటు ఆయన సోదరుడు అనిల్, మహేష్‌లు బండబూతులకు దిగారు. ఈ గొడవకు సంబంధించిన వీడియోలన్నీ అర్ధరాత్రి సోషల్‌మీడియాలో వైరల్ కాగా అర్ధరాత్రి భయానక వాతావరణం నెలకొంది. అరుపులు, కేకలతో ఆ ప్రాంతమంతా ఉధ్రిక్తతకు దారి తీసింది. పోలీసులపై దూకుడు, అసభ్యకరపదజాలం సైతం వీడియోల ద్వారా బయటకు పొక్కింది. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అదే రోజు రాత్రి బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం ఉదయం బంజారాహిల్స్ ఏసీపీ కే.ఎస్.రావు ఘటనపై విచారణ చేపట్టారు. తనపై అరుణ్ కత్తితో దాడి చేసి చంపుతానని బెదిరించాడని ఆయన సోదరుడు అనిల్, మహేష్‌లు బెదిరించారంటూ ఉమాకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరుణ్‌పై ఐపీసీ సెక్షన్ 435, 323, 506, రెడ్‌విత్ 34 కింద కేసులు నమోదు చేశారు. అరుణ్‌ను అరెస్ట్ చేశారు. మిగిలినవారి ప్రమేయం ఎంత వరకు ఉన్నదానిపై విచారణ చేపడుతున్నట్లు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్కె. బాలకృష్ణారెడ్డి తెలిపారు. అలాగే పోలీసు విధులకు ఆటంకపరిచిన ఘటనపై కూడాదృష్టిసారిస్తామన్నారు. ఈ ఘటనతో స్థానికంగా పోలీసులు పెట్రోలింగ్ పెంచి పికెటింగ్ ఏర్పాటు చేశారు. -
బైక్‌ను ఢీకొట్టిన లారీ: ఒకరి మృతి
కరీంనగర్ జిల్లా: రేణికుంట బ్రిడ్జి సమీపంలో రాజీవ్ రహదారిపై బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఓ బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో బైక్‌లో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో ఆ మార్గంలో ఒక కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఒంగోలులో మరో బైకు దహనం
ఒంగోలు క్రైం: నగరంలోని బలరాం కాలనీలో శనివారం అర్ధరాత్రి దుండగులు మరో బైకును దహనం చేశారు. స్థానికంగా మెకానిక్‌గా పనిచేసే కరీముల్లా సాయంత్రం షెడ్డు మూసి తన మోటారు సైకిల్‌పై ఇంటికి వెళ్లాడు. ఇంటి ముందు తన వాహనాన్ని పార్క్ చేశాడు. అర్ధరాత్రి ఇంటి ముందు మంటలు రావటంతో పరిసర ప్రాంతాలవారు గమనించి అదుపు చేశారు. అప్పటికే బైకు పూర్తిగా కాలిపోయింది. బాధితుడు ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత నెలలో పట్టణంలో వివిధ చోట్ల నాలుగు బైకులు, కారును దుండగులు తగులబెట్టిన విషయం తెలిసిందే.