
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులు చిక్కిన 753 మంది మందుబాబులు గత నెలలో చెల్లించిన జరిమానా ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.78,94,100. ఫిబ్రవరిలో 3,261 మంది మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ చిక్కారని ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ మంగళవారం వెల్లడించారు. వీరిలో 768 మందిపై కోర్టుల్లో అభియోగపత్రాలు దాఖలు చేశామన్నారు.
15 మందికి జైలు శిక్ష విధించిన న్యాయస్థానం మిగిలిన 753 మందికి రూ.78.94 లక్షలు జరిమానా విధించిందన్నారు. జైలు శిక్ష పడిన వారిలో ఒకరికి 15 రోజులు, మరొకరికి 8 రోజులు, ముగ్గురికి వారం, ఎనిమిది మందికి ఐదు రోజులు శిక్షలు పడ్డాయి. మరో ఇద్దరిని కోర్టు సమయం ముగిసే వరకు నిల్చునేలా న్యాయమూర్తి ఆదేశించారు. గత నెలలో చిక్కిన వారిలో మిగిలిన 2493 మంది పైనా త్వరలోనే చార్జ్‌షీట్స్ వేయనున్నట్లు అనిల్‌కుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment