న్యూఢిల్లీ : ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ యువతి జరిమానాకు భయపడి నడిరోడ్డుపై హల్‌చల్ చేసింది. ట్రాఫిక్ పోలీసులతో వాగ్వివాదానికి దిగటమే కాకుండా చలానా వేస్తే ఆత్మహత్యకు పాల్పడతానంటూ బెదిరింపులకు దిగింది. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలోని ఐఎస్‌బీటీ బస్టాండ్ వద్ద విరిగిపోయిన నెంబర్ ప్లేటుతో రోడ్డుపై వెళుతున్న యువతి పోలీసుల కంటపడింది. దీంతో వారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందన జరిమానా కట్టాలని యువతితో చెప్పారు. పెద్ద మొత్తం జరిమానా కట్టాల్సి వస్తుందని భావించిన యువతి డ్రామాకు తెరతీసింది.
మొదట ట్రాఫిక్ పోలీసులతో వాగ్వివాదానికి దిగింది. తనను చలానా వేయకుండా వదిలిపెట్టాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఇలా ఓ 20నిమిషాల పాటు హల్‌చల్ చేసింది. అయితే యువతి తీరుతో విసిగిపోయిన పోలీసులు చలానా వేయకుండానే ఆమెను పంపించేశారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన సరిగ్గా ఎప్పుడు జరిగిందన్నది మాత్రం తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment