
శేషుకుమారికి రసీదు అందజేస్తున్న ముషారఫ్ అలీ
అమీర్‌పేట: రోడ్లపై ఫ్లెక్సీలు కట్టినందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు అమీర్‌పేట కార్పొరేటర్ నామన శేషుకుమారికి రూ.5,000 జరిమానా విధించారు. సోమవారం మంత్రులు వేములు ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎస్‌ఆర్‌నగర్‌కు వచ్చిన సందర్భంగా వారికి ఆహ్వానం పలుకుతూ కార్పొరేటర్ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ ఫ్లెక్సీలు కట్టినందుకు గాను కార్పొరేటర్‌కు జరిమానా విధించారు. అందుకు సంబంధించిన రసీదును కార్పొరేటర్‌కు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment