
సీజ్ చేసిన లారీ
గచ్చిబౌలి: 102 చలాన్లు పెండింగ్‌లో ఉన్న ఓ లారీని గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. బుధవారం ఉదయం నానక్‌రాంగూడలోని క్యూసిటీ వద్ద వెళ్తున్న లారీ(ఏపీ 12 డబ్ల్యూ 1445)ని గచ్చిబౌలి ట్రాఫిక్ ఎస్‌ఐ ఖాజాపాషా అడ్డుకుని తనికీ చేయగా 102 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ లారీని సీజ్ చేశారు. పెండింగ్ చలానాలు చెల్లిస్తేనే లారీని విడుదల చేస్తారని డ్రైవర్ జె.రాజుకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment