![20 Thousend Challans on Scooty in Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/4/scooty.jpg.webp?itok=BgZSYW_f)
ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు
బహదూర్‌పురా: బహదూర్‌పురా చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు ఆదివారం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో బైక్‌లు నడుపుతున్న మైనర్లను పట్టుకున్నారు. బహదూర్‌పురా ట్రాఫిక్ ఎస్సైలు సత్యనారాయణ, జి.కరుణాకర్ రెడ్డి ఆదివారం బహదూర్‌పురా చౌరస్తాలో ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టారు. డ్రైవింగ్‌లో పట్టుబడిన ఓ మైనర్ ద్విచక్ర వాహనంపై రూ.20 వేల పైచిలుకు చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకున్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment