
పికెట్ చౌరస్తాలో చలాన్లు విధిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
మారేడుపల్లి: నామినేషన్ల ఘట్టం చివరిరోజు కావడంతో కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్‌లోని అంబేడ్కర్, బా బూజగ్జీవన్‌రామ్‌ల విగ్రహాల వద్ద సోమవారం ఉద యం నుంచి మధ్యాహ్నం వరకూ సందడి నెలకొంది. కంటోన్మెంట్ నియోజకవర్గం ఎస్‌సీ రిజర్వుడు కావడం తో ఆయా పార్టీల అభ్యర్థులు ముందుగా ఇక్కడి అంబేడ్కర్, బాబూజగ్జీవన్‌రామ్‌ల విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా నామినేషన్ వేసేందుకు ఇక్కడి నుంచే తరలివెళ్లారు.
భారీగా జన సమీకర ణ చేసి వారిని డీసీఎంల్లో పికెట్ చౌరస్తాకు తీసుకురావడంతో కార్యకర్తలు, నాయకులతో చౌరస్తా కిక్కిరిసిపో యి వెల్లింగ్టన్ రోడ్ ట్రాఫిక్ వలయంలో చిక్కుకుపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరంలో భారీ వాహనాలు ప్రవేశించడంతో ట్రాఫిక్ పోలీసులు తమ కెమెరాలకు పని చెప్పారు. కనిపించిన ఏ వాహనాన్ని వదిలిపెట్టకుండా ఫొటోలు తీస్తూ చలాన్లు విధించారు.
Comments
Please login to add a commentAdd a comment