రామ్ చరణ్‌ నిర్మాణ సంస్థలో టాలీవుడ్‌ హీరో.. షూటింగ్‌ ప్రారంభం! | Tollywood Hero Nikhil New Movie Pooja Ceremony At Hampi Temple, Photos Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

The India House: రామ్ చరణ్‌ నిర్మాణ సంస్థలో టాలీవుడ్‌ హీరో.. షూటింగ్‌ ప్రారంభం!

Published Mon, Jul 1 2024 9:50 PM | Last Updated on Tue, Jul 2 2024 10:55 AM

Tollywood Hero Nikhil Movie Pooja Ceremony at hampi temple

టాలీవుడ్ హీరో హీరో నిఖిల్ సిద్ధార్థ్‌, సాయి మంజ్రేకర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ' ది ఇండియా హౌస్'. ఈ సినిమాకు రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణ సంస్థ వీ మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్‌ పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

ఈ మూవీ షూటింగ్‌ను హంపిలోని విరూపాక్ష ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించారు.  ఆ శివుని ఆశీస్సులతో షూటింగ్‌ ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాణ సంస్థ ట్విటర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ చిత్రం బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ జూలై 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాను 1905లో జరిగిన పీరియాడిక్‌ కథాచిత్రంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement