
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా.. వాహనదారులు పట్టించుకోకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్డుపై వెళ్తూనే ఉంటారు. నింబంధనలు ఉల్లంఘించిన వారిని రోడ్డుపైనే నిలిపి పోలీసులు చలానాలు రాసినా.. ఫోటోలు తీసి ఇంటికి జరిమానాలు పంపినా కూడా కొంత మంది మాత్రం పట్టించుకోకుండా యాథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు. ట్రాఫిక్ పోలీసుల కెమెరాలకు చిక్కకుండా కొంతమంది తమ తెలివితేటలను ప్రదర్శిస్తారు. నెంబర్ ప్లేట్ కనిపించకుండా దాచేస్తారు.
తాజాగా ఓ వ్యక్తి ఎన్టీఆర్ గార్డెన్స్ రోడ్డు గుండా వెళ్తూ నిబంధనలు ఉల్లంఘించాడు. బైక్‌పైన ఏకంగా నలుగురిని ఎక్కించుకుని వెళ్తున్నాడు. సీసీ కెమెరాల్లో చిక్కకుండా నెంబర్ ప్లేట్‌కు ఓ సంచీని అడ్డుపెట్టి మరో ఉల్లంఘనకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఓ నెటిజన్ స్పందించి.. ‘ఐదుగురితో వెళ్లడమే కాకుండా.. నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేయడం మరో ఉల్లంఘన. ఇలా అయితే ఎలా? ’ అని ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిబంధనలు ఉల్లంఘించిన బాధ్యుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు రిప్లై ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment