
సాక్షి, హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించిన కేసు విచారణలో భాగంగా పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. పవన్‌పై ఎలాంటి రెక్కీగానీ, దాడికి కుట్రగానీ లేదని పోలీసులు తేల్చారు.
ఆదిత్య విజయ్, వినోద్, సాయికృష్ణ న్యూసెన్స్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, వీరంతా పబ్‌కు వెళ్లి తప్పతాగి తిరిగివస్తూ పవన్ ఇంటి ముందు కారు ఆపారు. ఈ క్రమంలో కారు తీయాలని చెప్పిన పవన్ సెక్యూరిటీ సిబ్బందితలో యువకులు గొడవపడినట్టు తెలిపారు. ఇక, జూబ్లీహిల్స్ పోలీసులు.. ముగ్గురు యువకులను విచారించి నోటీసులు ఇచ్చినట్టు స్పష్టం చేశారు. తాగిన మైకంలోనే న్యూసెన్స్ చేసినట్టు యువకులు అంగీకరించారని పోలీసులు పేర్కొన్నారు. కాగా, పవన్ ఇంటి ముందు ఆపిన కారుకు గుజరాత్ రిజిస్ట్రేషన్ ఉండగా.. సాయికృష్ణకు చెందిన కారుగా పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment