
Mahesh Babu buys plot in Jubilee Hills : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు జూబ్లీహిల్స్‌లో కొత్త ప్లాటు కొనుగోలు చేశారు. నగరంలోనే రెసిడెన్షియల్ ఏరియాలకు సంబంధించి అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన జూబ్లీహిల్స్‌లో ఇటీవల మహేశ్‌బాబు ప్లాటును కొన్నారు. ఈ మేరకు ప్రముఖ బిజినెస్ వెబ్‌సైట్ మనీ కంట్రోల్ కథనం ప్రచురించింది.
ప్లాటు ధర ఎంతంటే
మహేశ్‌బాబు కొనుగోలు చేసిన ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల వివరాల ప్రకారం... యర్రం విక్రాంత్‌రెడ్డి అనే వ్యక్తి నుంచి మహేశ్‌బాబు 1442 గజాల ప్లాటును కొనుగోలు చేశారు. ఇందుకు గాను మహేశ్‌బాబు రూ.26 కోట్ల రూపాయలను వెచ్చించారు. ఇందులో స్టాంప్‌డ్యూటీ కింద రూ.1.43 కోట్లు ట్రాన్స్‌ఫర్ డ్యూటీ కింద రూ.39 లక్షలు చెల్లించారు. 2021 నవంబరు 17న ఈ సేల్‌డీడ్ జరిగినట్టు సమాచారం.
ఇక్కడే రేట్లు అధికం
జూబ్లీహిల్స్‌లో నివాస స్థలాకు సంబంధించి సగటున ఒక్కో ప్లాటు వెయ్యి చదరపు గజాల విస్తీర్ణంలో ఉంటాయి. ఇక్కడ గజం భూమి ధర రూ.1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకుగా ఉంది. ఇక మహేశ్‌బాబు కొనుగోలు చేసిన స్థలం విషయానికి వస్తే.. గత యజమాని అయిన యర్రం విక్రాంత్ రెడ్డి.. ఈ స్థలంలో ఉన్న పాత ఇంటిని కూల్చేసి కొత్త ఇళ్లు కట్టాలని ముందుగా అనుకున్నారు... అయితే కొత్త నిర్మాణ పనులు చేపట్టకుండా.. ఈ ఇంటి స్థలాన్ని మహేశ్‌బాబుకు అమ్మేశారు. ఇంటి స్థలం కొనుగోలుపై ప్రిన్స్ నుంచి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.
హైదరాబాద్‌లో రియల్ పికప్
కరోనా సంక్షోభం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒడిదుడుకులకు లోనైంది. అయితే ఐటీ కంపెనీలు ఎక్కువగా విస్తరించి, స్టార్టప్‌లు ఎక్కువగా వెలుస్తున్న బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో రియల్టీ పరిస్థితులు త్వరగా చక్కబడ్డాయి. కోవిడ్ తర్వాత ఇక్కడ భూముల ధరలు 2 నుంచి 6 శాతం వరకు పెరిగాయి.
చదవండి: అమితాబ్ ఇంట్లో అద్దెకు దిగిన కృతి సనన్.. రెంట్ వింటే షాకవుతారు?
Comments
Please login to add a commentAdd a comment