![BRS leaders maganti gopinath Ravula Sridhar Fight on stage - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/26/Untitled-1_1.jpg.webp?itok=pa_4nQ0X)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్ వేదికగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. ఇద్దరు వేదికపైనే తిట్టుకున్నారు. మాగంటి మాట్లాడుతుండగా శ్రీధర్ రెడ్డి అడుకున్నారు. దీంతో శ్రీధర్ రెడ్డిపై మాగంటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘నిన్ను ఎవడ్రా పిలిచింది’ అంటూ మాగంటి గోపి ఫైర్ అయ్యారు. దీనికి శ్రీధర్ రెడ్డి బదులిస్తూ ‘నువ్వేవడివి.. నాకు చెప్పడానికి’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇంతలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ జోక్యం చేసుకొని ఇరువురి నేతలకు సర్ది చెప్పారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఈ క్రమంలోనే స్టేజీ కింద ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ కొంత అసంతృప్తికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
చదవండి: ఫోన్ ట్యాపింగ్‌పై పొలిటికల్ ఫైట్.. రేవంత్, కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Comments
Please login to add a commentAdd a comment