కేసీఆర్తో టీడీపీ ఎమ్మెల్యేల భేటీ | tdp mlas maganti gopinath, arikepudi gandhi meet cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్తో టీడీపీ ఎమ్మెల్యేల భేటీ

Published Thu, Mar 10 2016 2:08 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

కేసీఆర్తో టీడీపీ ఎమ్మెల్యేల భేటీ - Sakshi

కేసీఆర్తో టీడీపీ ఎమ్మెల్యేల భేటీ

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ సమావేశమయ్యారు. గురువారం మధ్యాహ్నం వీరిద్దరూ సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి కేసీఆర్ను కలిశారు.

గోపీనాథ్, గాంధీ టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. తమను అధికార టీఆర్‌ఎస్ సభ్యులుగా గుర్తించాలని స్పీకర్ ఎస్ మధుసూదనాచారికి లేఖ కూడా రాశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాంధీ, గోపీనాథ్‌లను టీడీపీ నాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాగా తెలంగాణ టీడీపీలో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. టీడీపీఎల్‌పీ నేత రేవంత్‌రెడ్డి, ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఉన్నారు. ఇంతకుముందు పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement