గులాబీ గూటికి ఎమ్మెల్యే సాయన్న | Mla sayanna to TRS | Sakshi
Sakshi News home page

గులాబీ గూటికి ఎమ్మెల్యే సాయన్న

Published Mon, Jan 4 2016 3:33 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

గులాబీ గూటికి ఎమ్మెల్యే సాయన్న - Sakshi

గులాబీ గూటికి ఎమ్మెల్యే సాయన్న

అనుచరులతో కలసి ముఖ్యమంత్రి సమక్షంలో చేరిక

 హైదరాబాద్: కంటోన్మెంట్ టీడీపీ ఎమ్మెల్యే సాయన్న ఆది వారం అనుచరులతో కలసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన పార్టీ మారడం ఇదివరకే ఖరారైనప్పటికీ ఆదివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో లాంఛనంగా టీ ఆర్‌ఎస్‌లో చేరారు. స్వయంగా కేసీఆర్ ఆయనకు కండువా వేసి, పార్టీలోకి ఆహ్వానించగా, సాయన్న అనుచరులు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో పార్టీలో చేరారు. ఆదివారం మధ్యాహ్నం కార్ఖానాలోని తన నివాసం నుంచి బయలు దేరడానికి ముందే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేసి  లేఖను టీటీడీ ఈవోకు ఫ్యాక్స్ ద్వారా పంపారు.

 నేరుగా టీఆర్‌ఎస్‌ఎల్‌పీకి..
 ఆదివారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా టీఆర్‌ఎస్‌లో చేరిన సాయన్న.. అటు నుంచే నేరుగా సీఎంతో కలసి టీఆర్‌ఎస్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ  టీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి హాజరయ్యారు. టీడీపీ నుంచి గెలిచిన సాయన్న పార్టీలో చేరిన వెంటనే టీఆర్‌ఎస్‌ఎల్‌పీకి హాజరు కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement