అడిగినవి ఇస్తే టీఆర్‌ఎస్‌లోకి వస్తా | Rajendra nagar mla prakash goud demands on join to trs party | Sakshi
Sakshi News home page

అడిగినవి ఇస్తే టీఆర్‌ఎస్‌లోకి వస్తా

Published Mon, Jan 19 2015 8:28 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

అడిగినవి ఇస్తే టీఆర్‌ఎస్‌లోకి వస్తా - Sakshi

అడిగినవి ఇస్తే టీఆర్‌ఎస్‌లోకి వస్తా

*రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్
మణికొండ: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ. 350 కోట్ల నిధులతో పాటు ఇంటింటికీ మంజీరా నీటిని సరఫరా చేస్తే తాను తప్పకుండా టీఆర్‌ఎస్‌లో చేరతానని టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ స్పష్టం చేశారు. గండిపేట్‌లో ఆదివారం ఆయన కైట్‌ఫెస్టివల్‌ను ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. మూడునెలల క్రితం తనను సీఎం పిలిచినపుడే తన నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల వివరాలను తెలిపానని, అవి చేపడితే తప్పకుండా పార్టీలో చేరతానని స్పష్టం చేశానన్నారు.

మూడు నెలలు గడచినా మంజీరా నీరు, అభివృద్ధి పనుల విషయంలో ఎలాంటి కదలికలేనపుడు తాను పార్టీ మారి ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గం పరిధిలోని నాలుగు డివిజన్‌లకు రూ. 200 కోట్లు, రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాలకు రూ. 150 కోట్ల నిధులను అడిగానన్నారు.

 

నియోజకవర్గ ప్రజలు తనను రెండు సార్లు గెలిపించారని, వారి ప్రయోజనం చూడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ప్రస్తుతం సీఎం కేసీఆర్‌లు అభివృద్ధి, పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని ఆయన కితాబిచ్చారు. అందుకే వారికి ప్రజల్లో మంచిపేరు ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement