ఎర్రబెల్లి నిర్ణయంపై మాగంటి ఆశ్చర్యం | Maganti Gopinath surprised errabelli dayakar rao quit | Sakshi
Sakshi News home page

ఎర్రబెల్లి నిర్ణయంపై మాగంటి ఆశ్చర్యం

Published Thu, Feb 11 2016 12:33 PM | Last Updated on Sun, Sep 3 2017 5:26 PM

ఎర్రబెల్లి నిర్ణయంపై మాగంటి ఆశ్చర్యం

ఎర్రబెల్లి నిర్ణయంపై మాగంటి ఆశ్చర్యం

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని టీడీపీకి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఏసీబీ నుంచి తనకు ఎటువంటి నోటీసులు అందలేదని మీడియాతో చెప్పారు.

ఎర్రబెల్లి దయాకరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరడం తనకు ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. ఎర్రబెల్లి తనకు మంచి మిత్రుడని, తామంతా కలిసి పోరాటం చేశామని గుర్తుచేశారు.

టీఆర్ఎస్ లో చేరుతున్నారని వచ్చిన వార్తలపై ఆయన ఆచితూచి స్పందించారు. టీఆర్ఎస్ నుంచి తనకు ఎటువంటి ప్రతిపాదన రాలేదని చెప్పారు. తనతో టీఆర్ఎస్ నాయకులు ఎవరూ చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. టీడీపీలోనే కొనసాగుతానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement