jubilee hills mla
-
ఎర్రబెల్లి నిర్ణయంపై మాగంటి ఆశ్చర్యం
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని టీడీపీకి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఏసీబీ నుంచి తనకు ఎటువంటి నోటీసులు అందలేదని మీడియాతో చెప్పారు. ఎర్రబెల్లి దయాకరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరడం తనకు ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. ఎర్రబెల్లి తనకు మంచి మిత్రుడని, తామంతా కలిసి పోరాటం చేశామని గుర్తుచేశారు. టీఆర్ఎస్ లో చేరుతున్నారని వచ్చిన వార్తలపై ఆయన ఆచితూచి స్పందించారు. టీఆర్ఎస్ నుంచి తనకు ఎటువంటి ప్రతిపాదన రాలేదని చెప్పారు. తనతో టీఆర్ఎస్ నాయకులు ఎవరూ చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. టీడీపీలోనే కొనసాగుతానని తెలిపారు. -
టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్‌కు రంగం సిద్ధం?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఏసీబీ దర్యాప్తులో మరిన్ని ఆధారాలు లభించినట్టు సమాచారం. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇవ్వజూపిన నగదు ఎక్కడి నుంచి వచ్చిందన్న సమాచారం కోసం ఏసీబీ కొంతకాలంగా ఆరాతీస్తున్న విషయం తెలిసిందే. రేవంత్‌రెడ్డి, గోపీనాథ్ నుంచే ఆ నగదు తీసుకుని స్టీఫెన్సన్ వద్దకు వెళ్లారని ఏసీబీ దర్యాప్తులో తేలినట్టు సమాచారం. తాజా ఆధారాలతో గోపీనాథ్‌కు వారెంటు జారీ చేసి, నేడో, రేపో అరెస్టు చేయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయడం, ఆయన షరతులతో కూడిన బెయిలుపై బయటికి రావడం తెలిసిందే. ఓటుకు నోటు కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందన్న అంశంపై ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. వీలైనంత త్వరగా ఈ కేసును ఒక కొలిక్కి తేవాలని ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు గోపీనాథ్ రేవంత్‌రెడ్డికి నగదు సమకూర్చినట్టు భావిస్తున్నారు. గోపీనాథ్‌ను అరెస్టు చేసి విచారణ జరిపితే మరిన్ని వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. -
ఎమ్మెల్యే పాదయాత్ర: సమస్యలు ఏకరువు పెట్టిన స్థానికులు
రహమత్‌నగర్ (హైదరాబాద్): రహమత్‌నగర్ డివిజన్ కార్మికనగర్ బస్తీలో మౌలిక సమస్యలపై జూబ్లీహిల్స్ శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ శుక్రవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్యెల్యే బస్తీలోని మహిళలతో వారి సమస్యల గురించి ప్రస్తావించారు. కార్మికనగర్ బస్తీలో మురుగు నీటి సమస్య విపరీతంగా ఉందని స్ధానికులు ఎమ్యెల్యే మాగంటి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్బంగా బస్తీల్లోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాగంటి గోపీనాథ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 18 న రహమత్‌నగర్ డివిజన్లోని బంగారు మైసమ్మ దేవాలయం వద్ద జరిగే సమీక్ష సమావేశంలో స్ధానికులు తమ సమస్యను తెలపితే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.. కార్మికనగర్ డ్రైనేజి సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.