
ఎమ్మెల్యే పాదయాత్ర: సమస్యలు ఏకరువు పెట్టిన స్థానికులు
రహమత్‌నగర్ (హైదరాబాద్): రహమత్‌నగర్ డివిజన్ కార్మికనగర్ బస్తీలో మౌలిక సమస్యలపై జూబ్లీహిల్స్ శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ శుక్రవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్యెల్యే బస్తీలోని మహిళలతో వారి సమస్యల గురించి ప్రస్తావించారు. కార్మికనగర్ బస్తీలో మురుగు నీటి సమస్య విపరీతంగా ఉందని స్ధానికులు ఎమ్యెల్యే మాగంటి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్బంగా బస్తీల్లోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాగంటి గోపీనాథ్ అధికారులను ఆదేశించారు.
ఈ నెల 18 న రహమత్‌నగర్ డివిజన్‌లోని బంగారు మైసమ్మ దేవాలయం వద్ద జరిగే సమీక్ష సమావేశంలో స్ధానికులు తమ సమస్యను తెలపితే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.. కార్మికనగర్ డ్రైనేజి సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.