హైదరాబాద్, సాక్షి: కౌశిక్ రెడ్డికి, తనకు మధ్య జరిగిన సంవాదం ద్వారా ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరిగాయని శేర్‌లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తాజా పరిణామాల అనంతరం.. శుక్రవారం తన నివాసంలో మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
ప్రాంతీయ విబేధాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కౌశిక్‌రెడ్డిని ఎవరు ప్రొత్సహించారు?. నన్ను నాలుగైదుసార్లు రెచ్చగొట్టేలా మాట్లాడాడు. అసలు ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలి.
.. నేను మాట్లాడింది తప్పే.. కానీ రెచ్చగొట్టడం వల్లే అలా మాట్లాడాల్సి వచ్చింది. మహిళలను కూడా కించపరిచేలా మాట్లాడారు. హరీష్ నన్ను భాష మార్చుకోవాలని సూచించారు. కానీ, ఉన్నతమైన ఐఏఎస్, ఐపీఎస్‌లపై హరీష్ ఎలాంటి భాష వాడారో మనం చూడలేదా? అని అరికెపూడి గాంధీ ప్రశ్నించారు.
ఇదీ చదవండి: తెలంగాణ కోసం చావడానికి సిద్ధం!
Comments
Please login to add a commentAdd a comment