సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి రెచ్చగొట్టేలా మాట్లాడితే ఆ పార్టీ కార్యకర్తలు కూడా అలాగే చేస్తారు అంటూ రేవంత్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
కోకాపేటలో హౌస్ అరెస్ట్‌లో ఉన్న హరీష్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో లా అండ్ ఆర్ఢర్ ఉందా?. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. బీఆర్‌ఎస్ నేతలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకున్నారా?. దాడికి పాల్పడిన వారిపై ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు. సీఎం రెచ్చగొట్టేలా మాట్లాడితే ఆ పార్టీ కార్యకర్తలు కూడా అలాగే చేస్తారు. గొడవలకు సీఎం, డీజీపీదే బాధ్యత. మమ్మల్ని ఇవాళ హౌస్ అరెస్ట్ చేయించారు. నిన్న అరికెపూడి గాంధీని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయించలేదు.
నిన్న గాంధీని హౌస్ అరెస్ట్ చేయిస్తే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి జరిగేది కాదు కదా?. ఇది గాంధీ చేసిన దాడి కాదు.. రేవంత్ రెడ్డి చేయించిన దాడి. ఇది స్పష్టంగా రేవంత్ రెడ్డి అజెండా అని అర్థమవుతోంది. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టు మొట్టికాయలు వేసింది. రేవంత్‌వి డైవర్షన్ పాలిటిక్స్. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఏదో ఒక డ్రామాకు తెరలేపుతారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇలాంటి నిర్భందాలు చూడలేదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధం: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment