arekapudi gandhi
-
అరికెపూడి గాంధీ పార్టీ మారలేదు అన్నారు... మరీ ఈ పిచ్చి పనులేంది
-
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
-
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై కేసు నమోదు
-
ఇరు పార్టీల నేతల మధ్య పేలిన మాటల తూటాలు
-
గాంధీకి స్టేషన్ బెయిల్.. బీఆర్ఎస్ నేతలు అందుకే అరెస్ట్: సీపీ అవినాష్ మహంతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిష్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య ఘర్షణ ఎపిసోడ్ రాజకీయంగా చర్చకు దారి తీసింది. వాదనలు, ఘర్షణల సందర్భంగా ఇరు వర్గాల నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇక, అరెస్ట్‌లపై తాజాగా సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి కీలక వ్యాఖ్యలు చేశారు.తాజాగా సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి కేసులో అరికెపూడి గాంధీని అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ముందస్తు చర్యల్లో భాగంగానే హరీష్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నాం. హరీష్‌రావుకు అరెస్ట్ చేసిన నోటీసు ఇచ్చి పంపించివేశాం. పోలీసుల విధులకు కౌశిక్‌రెడ్డి ఆటంకం కలిగించారని మరో కేసు నమోదైంది. కౌశిక్, గాంధీలపై మూడు కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.ఇదిలా ఉండగా.. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మహిళా కాంగ్రెస్ నేతలు శుక్రవారం (సెప్టెంబర్13) స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో కౌశిక్‌రెడ్డి ఓటర్లను బెదిరించి గెలిచారని, గెలిచాక మహిళలను కించపరుస్తూ మాట్లాడినందున కౌశిక్‌రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.అయితే, పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా కౌశిక్‌రెడ్డి మీడియా సమావేశంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ వారికి చీర,గాజులను పంపిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఇది కూడా చదవండి: కౌశిక్ వ్యాఖ్యలపై కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి: మంత్రి కోమటి రెడ్డి -
తెలంగాణ ఉద్యమంలోనూ ఇంతటి నిర్బంధాలు లేవు: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి రెచ్చగొట్టేలా మాట్లాడితే ఆ పార్టీ కార్యకర్తలు కూడా అలాగే చేస్తారు అంటూ రేవంత్‌పై తీవ్ర విమర్శలు చేశారు.కోకాపేటలో హౌస్ అరెస్ట్‌లో ఉన్న హరీష్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో లా అండ్ ఆర్ఢర్ ఉందా?. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ నేతలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకున్నారా?. దాడికి పాల్పడిన వారిపై ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు. సీఎం రెచ్చగొట్టేలా మాట్లాడితే ఆ పార్టీ కార్యకర్తలు కూడా అలాగే చేస్తారు. గొడవలకు సీఎం, డీజీపీదే బాధ్యత. మమ్మల్ని ఇవాళ హౌస్ అరెస్ట్ చేయించారు. నిన్న అరికెపూడి గాంధీని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయించలేదు.నిన్న గాంధీని హౌస్ అరెస్ట్ చేయిస్తే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి జరిగేది కాదు కదా?. ఇది గాంధీ చేసిన దాడి కాదు.. రేవంత్ రెడ్డి చేయించిన దాడి. ఇది స్పష్టంగా రేవంత్ రెడ్డి అజెండా అని అర్థమవుతోంది. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టు మొట్టికాయలు వేసింది. రేవంత్‌వి డైవర్షన్ పాలిటిక్స్. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఏదో ఒక డ్రామాకు తెరలేపుతారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇలాంటి నిర్భందాలు చూడలేదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధం: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి -
KSR Live Show: గాంధీకి కౌంటర్ గా కౌశిక్ రెడ్డి మాస్టర్ ప్లాన్..
-
గాంధీకి కౌంటర్ గా కౌశిక్ రెడ్డి మాస్టర్ ప్లాన్..
-
కౌశిక్ రెడ్డి పై ఆరెకపూడి గాంధీ కామెంట్స్
-
కౌశిక్ రెడ్డి, ఆరెకపూడి గాంధీ ఎపిసోడ్ పై కాంగ్రెస్ నేత రియాక్షన్..
-
కౌశిక్ రెడ్డి ఇంటినుండి బయటకు వస్తే అడ్డుకుంటారు గాంధీ ర్యాలీగా వస్తుంటే అడ్డుకోరా..
-
భారీ ఎత్తున ఆందోళనకు సిద్ధమైన కౌశిక్ రెడ్డి
-
తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన గాంధీ, కౌశిక్ రెడ్డి ఎపిసోడ్
-
నా వెంట్రుక కూడా పీకలేరు.. గాంధీకి నేనేంటో చూపిస్తా..
-
పోలీసుల అదుపులో ఆరెకపూడి గాంధీ
-
నా హత్యకు కుట్ర పన్నారు: కౌశిక్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని ఆహ్వానిస్తే.. ఆయన తన గూండాలను తనపైకి పంపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఇది తన హత్యాయత్నం కుట్రలో భాగంగా జరిగిన దాడేనని ఆరోపించారాయన. ‘‘గూండాలు వచ్చి దాడి చేయడం కరెక్టేనా?. కట్టెలు, కర్రలతో వచ్చి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రీ ప్లాన్డ్గా దాడి చేశారు. తెలంగాణలో లా అండ్ ఆర్డ్ ఉందా?. ఒక ఎమ్మెల్యేకే సెక్యూరిటీ లేకపోతే సామాన్యుల పరిస్థితేంటి? కచ్చితంగా దాడికి ప్రతిదాడి ఉంటుంది. రేపు వాళ్ల సంగతి తేలుస్తా’ అని అన్నారు.కౌశిక్‌రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గాంధీ అనుచరులు కౌశిక్ ఇంట్లోకి దూసుకెళ్లారు. కౌశిక్ ఇంటిపై గాంధీ అనుచరులు రాళ్లు విసిరారు. ఈక్రమంలో ఇరు వర్గాలు కుర్చీలతో కొట్టుకున్నారు. ఒక దశలో ఇరు వర్గాలను పోలీసులు అదుపు చేయలేకపోయారు.చదవండి: కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి.. బలవంతంగా అరికెపూడి తరలింపు -
ఆరెకపూడి గాంధీ నా ఇంటికి వస్తే..
-
పాడి కౌశిక్ రెడ్డి ఇంటికెళ్లి సినిమా చూపిస్తా
-
కౌశిక్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరిన అరికెపూడి గాంధీ
-
ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య సవాళ్లపర్వం
-
పీఏసీ చైర్మన్ పదవిపై హరీష్ రావుకు ఆరెకపూడి గాంధీ కౌంటర్
-
పీఏసీ ఛైర్మన్‌గా అరికెపూడి.. హరీష్‌రావు సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ బీఫామ్‌తో గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న అరికెపూడి గాంధీకి ఏపీసీ ఛైర్మన్ పదవి ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు.కాగా, మాజీ మంత్రి హరీష్ రావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పీఏసీ ఛైర్మన్ పదవి ప్రతిపక్షంలో ఉన్న వారికి ఇవ్వాలి. కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారికి కాదు. అరికెపూడి గాంధీకి ఎలా ఇస్తారు. లోక్‌సభలో పీఏసీ ఛైర్మన్ కేసీ వేణుగోపాల్‌కు ఇవ్వలేదా?. రాహుల్ గాంధీ లోక్‌సభలో భారత రాజ్యాంగాన్ని పట్టుకుని మాట్లాడుతారు. కానీ, తెలంగాణలో మాత్రం రాజ్యంగం ఉండదా?. రాహుల్‌కు రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.ఇదే సమయంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ మాట్లాడుతూ..‘ఈరోజు 16వ ఆర్థిక సంఘాన్ని కలిశాము. ప్రస్తుతం ఉన్న 40 శాతం షేర్‌ను 50% పెంచాలని కోరాము. కానీ, ప్రస్తుతం ఉన్న 40% కూడా కాకుండా 31 శాతమే తెలంగాణకి షేర్ వస్తుంది. తెలంగాణకి రావలసిన నిధుల షేర్‌పై మా వాదన గట్టిగా వినిపించాం. తెలంగాణ ఆదాయం మంచిగా ఉంది మీకు తక్కువ నిధులు కేటాయిస్తామంటే కరెక్ట్ కాదు. దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రంలో తెలంగాణ మారటానికి కేసీఆర్ చేసిన కృషిని ఆర్థిక సంఘానికి వివరించాము. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరాము. ఇంటింటికి నీరు అందించే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టినందుకు నిధులు ఇవ్వలేదు. హర్ ఘర్ జల్లో భాగంగా మిషన్ భగీరథకి రూ.2500 కోట్లు మెయింటెనెన్స్ ఇవ్వమని అడిగిన ఇవ్వలేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
కాంగ్రెస్ గూటికి అరికెపూడి
-
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లోకి చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయనతో పాటు ముగ్గురు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు కాంగ్రెస్‌లోకి చేరారు.బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది. గులాబీ ఎమ్మెల్యేలు వరుసగా అధికార కాంగ్రెస్‌లో చేరుతున్నారు. గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓటమితో ఈ సంఖ్య 38కి చేరింది.ఇక గత ఆరు నెలల్లో బీఆర్ఎస్ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. నిన్న(శుక్రవారం) రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా కాంగ్రెస్‌లోకి చేరారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు చేరిక ఖరారు కాగా... హైదరాబాద్ నగరానికి చెందిన మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. -
ఆస్తులు రూ.44 కోట్లు.. అప్పులు రూ.96 లక్షలు
హైదరాబాద్: శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ ఆస్తులు రూ.44,79,93,000 కాగా అప్పులు రూ.96, 34,167గా ఉన్నాయి. నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్లో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. వీటికి అదనంగా గాంధీ భార్య శ్యామలదేవికి రూ.31,65,38,000 ఆస్తులు ఉండగా అప్పులు రూ.86,34,167 ఉన్నాయి. 2014లో మాదాపూర్ ఠాణా పరిధిలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించిన ఆరోపణలతో గాంధీపై ఓ కేసు నమోదైంది. గత ఎన్నికల (2018) అఫిడవిట్లో ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసు పరిష్కారం కావడంతో ప్రస్తుతం గాం«దీకి ఎలాంటి నేర చరిత్ర లేదు. -
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఎన్నికల ప్రచారం
-
‘మంత్రి పదవి రానందుకు అసంతృప్తి లేదు’
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కేబినెట్లో మంత్రి పదవి దక్కకపోవడంతో ఎలాంటి అసంతృప్తి లేదని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. అలకబూనిన ఎమ్మెల్యే గాంధీ, గన్మెన్లను పంపించారని మీడియాలో వచ్చిన కథనాలను ఆయన కొట్టి పారేశారు. తన మనవడిని చూసేందుకు గుంటూరుకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో రెండు రోజుల పాటు గన్మెన్లను వాపస్ పంపానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన ప్రతిసారి గన్మెన్లను తీసుకొని వెళ్లాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు. సోమవారం గుంటూరుకు వెళ్లేందుకు ప్రయాణమైన ఆయన నగర శివార్లలోకి వెళ్లగానే గన్మెన్లను పంపించారనే ప్రచారం జరగడంతో వెనుదిరిగి వివేకానందనగర్‌లోని తన ఇంటికి చేరుకున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లిన ప్రతిసారి ఇలానే గన్మెన్లను పంపిస్తానని వివరించారు. తమ సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్‌కు మంత్రి పదవి ఇవ్వడం పట్ల ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు విధేయునిగా ఉంటానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం కేటీఆర్‌ను కలిశానన్నారు. (చదవండి: గులాబీ పుష్పక విమానం.. ఓవర్ లోడ్!) -
బాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఖాయం
యడ్లపాడు (చిలకలూరిపేట): సరైన సమయంలో సరైన విధంగా ఏపీ సీఎం చంద్రబాబు కు సీఎం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేర్కొన్నారు. ఏపీలోని గుంటూరు జిల్లా యడ్లపాడు మండల కేంద్రంలో బుధవారం జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రాజకీయంగా టీడీపీ ఎన్ని ఎత్తుగడలు వేసినా.. ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారన్న విషయం తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు రుజువు చేశాయని పేర్కొన్నారు. ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఖాయమని, అయితే అది ప్రత్యక్షమా పరోక్షమా అనే విషయాలు సస్పెన్స్ అని పేర్కొన్నారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో కలసి 60 ఎంపీ సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఏపీ ప్రజలు కూడా నిజాయితీగా పనిచేసే నాయకుడికే పట్టం కడతారని, కుట్రలతో పరిపాలించే వ్యక్తులను దూరం పెడతారని జోస్యం చెప్పారు. ఓటుకు కోట్లు కేసు వల్లే ఏపీ సీఎం చంద్రబాబు అర్ధంతరంగా ఆంధ్రాకు పరుగు పెట్టారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు విద్యుత్, సాగునీరు సమస్య తీవ్రంగా ఉండేదని, సీఎం కేసీఆర్ చలవతో రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా, మిషన్ భగీరథతో తాగు, సాగునీరు సమస్య పరిష్కారం అయిందని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు కేసీఆర్ పథకాలను కాపీకొట్టి మరో మోసానికి తెర తీశారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఏర్పడిన పార్టీ అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడం టీడీపీలోని సగం మంది జీర్ణించులేకపోతున్నారని చెప్పారు. -
'టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా మమ్మల్ని గుర్తించండి'
హైదరాబాద్: టీటీడీపీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి లేఖ రాశారు. తమను టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో చేర్చుకోవాలని తమ లేఖలో టీడీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీలో విలీనం అయినట్టుగా గుర్తించాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. టీటీడీపీలో ఇక ముగ్గురే..! మాగంటి గోపీనాథ్ సోమవారం ఉదయమే సీఎం కేసీఆర్‌ను కలసి తమ చేరిక గురించి చర్చించారు. మంగళవారం అరికెపూడి గాంధీతో కలసి మరోసారి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలూ పార్టీ మారితే.. ఇక తెలంగాణ టీడీపీకి మిగిలేది ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే కావడం గమనార్హం. టీడీపీలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాత్రమే మిగిలారు. -
11న టీఆర్ఎస్లోకి గాంధీ, గోపీనాథ్!!
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు సాక్షి, హైదరాబాద్: టీటీడీపీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడానికి ముహూర్తం కుదిరింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఈనెల 11వ తేదీన గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. మహారాష్ట్ర పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం రాత్రి తిరిగి వచ్చాక దాదాపు ఏడున్నర గంటల సమయంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయనను కలసి చర్చించారు. తమ చేరికకు గ్రీన్‌సిగ్నల్ తీసుకుని... ఇందుకు 11వ తేదీని ముహూర్తంగా ఎంచుకున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో వీరిద్దరూ టీఆర్ఎస్లో చేరనున్నారు. అయితే మాగంటి గోపీనాథ్ సోమవారం ఉదయమే సీఎం కేసీఆర్‌ను కలసి తమ చేరిక గురించి చర్చించారు. మంగళవారం అరికెపూడి గాంధీతో కలసి మరోసారి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలూ పార్టీ మారితే.. ఇక తెలంగాణ టీడీపీకి మిగిలేది ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే కావడం గమనార్హం. కాగా, టీడీఎల్పీని టీఆర్ఎస్లో చేర్చాలంటూ స్పీకర్‌కు లేఖ ఇచ్చిన ఎర్రబెల్లికి మాగంటి, అరికెపూడి మద్దతు తెలిపారని సమాచారం. విలీనానికి తాము కూడా అంగీకారం తెలుపుతున్నామని రాతపూర్వకంగా హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. -
'టీఆర్ఎస్ నేతల ఇళ్లను వదిలి మిగతావారిపై పడ్డారు'
హైదరాబాద్ : అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండోరోజు కూడా కట్టడాల కూల్చివేత కొనసాగుతోంది. కాగా కట్టడాల కూల్చివేతను శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మంగళవారం అడ్డుకున్నారు. కూల్చివేతలను ఆపివేయాలని ఆయన ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్‌ను కోరారు. అయితే కూల్చివేతలు ఆపేది లేదని అధికారులు తేల్చి చెప్పారు. దాంతో కూల్చివేతలను అడ్డుకున్న ఎమ్మెల్యే గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ టీఆర్ఎస్ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతల ఇళ్లను వదిలి మిగతా వారిపై పడ్డారని ఆయన ఆరోపించారు. తెలిసీ, తెలియక కొన్న భూములను రెగ్యులరైజ్ చేయాలని ఎమ్మెల్యే గాంధీ డిమాండ్ చేశారు. కాగా అక్రమ నిర్మాణాలపై చర్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. గురుకుల ట్రస్ట్ భూముల్లోని అక్రమ నిర్మాణాల వివరాలను ఆగమేఘాల మీద ఆరా తీసి కూల్చివేతలు కూడా చేపట్టారు. ట్రస్ట్ భూముల్లో వెలిసిన కాలనీల్లో ఒకటైన అయ్యప్ప సొసైటీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం సెంట్రింగ్‌ను, మరో భవనంపై పిల్లర్లను నిన్న ధ్వంసం చేశారు. దీంతో అయ్యప్ప సొసైటీలోని భవన యజమానుల గుండెల్లో దడ మొదలైంది. ఏ క్షణాన తమ భవనంపైకి వచ్చి పడతారోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.